తెలంగాణలో 700 కు చేరిన కరోనా కేసులు,కొత్తగా 50 కేసులు, 700 Corona cases in TS
రాష్ట్రంలో 700 Corona cases in TS గురువారం కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు . జలుబు , దగ్గు , తుమ్ములు లాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ఆందోళన వెలిబుచ్చారు.
ఇప్పటిదాకా తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 700 Corona cases in TS చేరిందనీ , రాష్ట్రంలో 10 వేల టెస్టులు చేశామని తెలిపారు . తాజాగా 68ని డిశ్చార్జ్ చేశామన్నారు . గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రిని ఈ నెల 20న ప్రారంభిస్తామని తెలిపారు.
హైదరాబాద్ లో కరోనా కంట్రోల్ సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు . వైద్యులకు అన్ని రకాల సౌకర్యాలు కలిపిస్తున్నామని తెలిపారు . గాంధీ , కింగ్ కోరి , చెస్ట్ ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు . రాష్ట్రంలోని అన్ని ల్యాబ్ టెస్టులను స్థాయిని బట్టి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పుడు ఉన్న వాటితో పాటు మరో రెండు ల్యాబ్ లకు కేంద్రం అనుమతి లభించిందనీ , 18వ తేదీ నుంచి ఆ ల్యాబ్లోనూ టెస్టులు చేస్తామని చెప్పారు . మరో మూడు వారాల్లో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు .
సూర్యాపేట జిల్లాలో గురువారం ఒక్కరోజే 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటివరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 39 కేసులు నమోదవగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా ఇప్పటి వరకు 51 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది .
అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంబంధీకులే . ఇదిలా ఉంటే సూర్యాపేట పట్టణంలో ఒకే కుటుంబంలో 15మందికి కరోనా సోకింది . నమోదైన కేసులన్నీ ఢిల్లీలోని మర్కజ్ వెళ్ళివచ్చిన వారి నుంచే వ్యాప్తి చెందడం గమనార్హం .
అధికారులు సూర్యాపేటను రెజోన్‌గా ప్రకటించి చర్యలు తీసుకుంటున్నప్పటికి ప్రాథమిక కాంటాక్ట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి . సూర్యాపేట పట్టణంలోని కొత్తగూడెం బజార్లోనే కేసులన్నీ నమోదవుతున్నాయి.
సూర్యాపేట పట్టణంతో పాటు తిరుమలగిరి , నేరేడుచర్ల , మఠంపల్లి , ఆత్మకూర్ మండలాల్లో కేసులు నమోదయ్యాయి . పోలీస్ లతో పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిరంతరం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూనే ఉన్నారు . అయితే పాజిటివ్ వచ్చిన కుటుంబాలను ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించి అక్కడ నుంచే రక్త నమూనాలు ల్యాకు పంపారు. రిపోర్ట్స్ వస్తుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు.
ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వారి ప్రాథమిక కాంటాక్టుల నుంచే కేసులు నమోదవుతున్నాయని చెప్పవచ్చు .
3 Comments