తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా, CoVID19 positive cases in Telangana

CoVID19 positive cases in Telangana కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి . తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది . గురువారం ఒక్క రోజే కొత్తగా 22 మందికి వ్యాధి సోకినటు నిర్ధారణ కాగా వివిధ ఆరోగ్య కారణాలతో ముగ్గురు మరణించారు .

 సీఎం సూచన మేరకు రాష్ట్రంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు . వైద్య , ఆరోగ్య శాఖ , పురపాలక శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి ఈటల సీఎం కేసీఆర్ కు నివేదించారు . కాగా గురువారం 22 CoVID19 positive cases in Telangana కేసులు నమోదైనాయని , మొత్తం కేసులు 1038కి చేరుకున్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు .

నమోదైన కేసుల వివరాలు ::

 మలక్ పేట లో పని చేస్తున్న పహడీ షరీఫ్ , జలపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులవల్ల దుకాణాలు నిర్వహిస్తున్న ముగ్గురు యజమానులకు , వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని చెప్పారు . వీరి కుటుంబాలన్నింటిని ఆసుపత్రిలోని ఐసోలేషన్లో ఉంచామని మంత్రి చెప్పారు . మలక్ పేట్ గంజ్ , పహడీషరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు .

 రామంతాపూర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయాడని షుగర్ , బీపీ నిమోనియాతో బాధపడుతూ అతను చనిపోయాడని మంత్రి వివరించారు . వనస్థలిపురం ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల వ్యక్తి గుండె , కిడ్నీ , నిమోనియాతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే మరణించాడని తెలిపారు . జియాగూడ దుర్గానగర్‌కు చెందిన 44 ఏళ్ల మహిళ బుధ వారం గాంధీ ఆసుపత్రికి వెంటిలేటర్‌పైనే వచ్చిందని , ఆమె ఆరుగంటల్లోనే మరణించిందని చెప్పారు . ఆమెకు బీసీ , షుగర్ ఉందని నిమోనియాతో బాధపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు .

 గురువారం 38 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స అనంతరం డిశ్చార్చీ అయ్యారని మంత్రి ఈటల తెలిపారు . ఇందులో 50 ఏళ్ల వైద్యుడు కోలుకుని డిశ్చార్జి అయ్యారని , 20 రోజుల క్రితం ఆయన తీవ్రమైన వ్యాధి లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరి హైడ్రోక్సీ క్లోరోక్వీన్ , అజిత్రోమైసిన్ తదితర మందులను అందించి ఆయన్ను పూర్తిగా నయం చేశామని చెప్పారు . రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ రోగులకు అందిస్తున్న చికిత్స , సౌకర్యాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషంగా ఉందని మంత్రి ఈటల పేర్కొన్నారు . రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ఇక్కడి పరీక్షల తీరు , ల్యాబ్లు పని చేస్తున్న విధానం పట్ల హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలీలా శ్రీవాత్సవ ప్రశంసలు కురిపించారని చెప్పారు .

 కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నారని కేంద్ర బృందమే నివేదిక పంపిన తర్వాత రాజకీయ విమర్శలకు తావులేదని మంత్రి చెప్పారు . గాంధీ , కింగ్ కోరి , గచ్చిబౌలి , ఫీవర్ ఆసుపత్రులు , ల్యాబ్లు , కంటైన్మెంట్ ప్రాంతాలు , సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ , నైట్ షెల్టర్లను విస్తృతంగా తనిఖీ చేసిన కేంద్ర బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదిక పంపించామని ఆ బృందమే చెప్పడం సంతోషాన్ని కలిగించిందని మంత్రి వివరించారు .

Related Articles

Back to top button