AP లో కరోనా విజృంభణ, ఒకే రోజులో 75కేసులు, 722 Corona cases in AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ తీవ్రతరమైంది . 722 Corona cases in AP ఏమాత్రం అడ్డూఅదుపు లేకుండా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది . తాజాగా 24 గంటల్లోనే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 75 పాజిటీవ్ కేసులు నిర్ధారణ అయ్యాయి .
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మొత్తం 3775 నమూనాలు సేకరించి పరీక్షించగా వాటిలో 75 మందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు తేలింది . దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 722 Corona cases in AP చేరుకుంది .
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25 కేసులు రిపోర్టవగా గుంటూరులో 20 , కర్నూ లులో 16 , అనంతపురంలో 4 , కృష్ణాలో 5 , తూర్పుగోదావరిలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి .
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులతో ఉంది . ఇక్కడ ఇప్పటివరకు 174 పాజిటీవ్ కేసులు రిపోర్టయ్యాయి . తర్వాతస్థానంలో గుంటూరు ఉంది . ఇక్కడ 149 మందికి కరోనా సోకింది . కృష్ణాలో 80 , చిత్తూరులో 58 , నెల్లూరులో 67 , ప్రకాశంలో 44 , కడపలో 40 , విశాఖలో 21 , తూర్పుగోదావరిలో 26 , పశ్చిమగోదావరిలో 35 కేసులు నమోదయ్యాయి .
రాష్ట్రంలో ఇప్పటి వరకు 92 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు . గత 24 గంటల్లో 27 మంది కోలుకున్నారు . కాగా విశాఖ జిల్లాలో నమోదైన మొత్తం 21 కేసుల్లో 18 మంది డిశ్చార్జి అవగా ఇంకా ముగ్గురు చికిత్స పొందుతున్నారు . కడపలో 19 మంది , గుంటూరులో 15 , తూర్పుగోదావరిలో 8 , కృష్ణాలో 14 , పశ్చిమగోదావరిలో 9 మంది చొప్పున రికవరీ అయ్యారు . ఇక ఇప్పటి వరకు 20 మంది కరోనా బాధితులు మరణించారు .
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్యలో కృష్ణా , అనంతపురం , కర్నూలు జిల్లాల్లో ముగ్గురు కరోనాకు బలైపోయారు . రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 30 వేలు దాటాయి . సోమవారం నాటికి మొత్తం 30 , 733 నమూనాలను సేకరించి , పరీక్షించి , వాటి ఫలితాలను వెల్లడించారు . వీటిలో 30 , 011నమూనాలకు నెగిటీవ్ రిపోర్టు వచ్చింది . 722 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది .
One Comment