కరోనా జంతువుల నుంచి వచ్చిందే-WHO, corona is not created by chaina

చైనా లో పుట్టి ప్రపంచాన్ని హడలెతీస్తున్న కరోనా వైరస్ పుట్టుక పై చాలా మంది కి అనుమానాలు ఉన్నాయి. corona is not created by chaina ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇది కరోనా వైరస్ కాదు చైనా వైరస్ అని బహిరంగంగానే చెబుతున్నారు.

ఇపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ వో  ఈ వైరస్ జంతువుల ద్వారానే వ్యాపించింది corona is not created by chaina ల్యాబ్లలో సృష్టించినది కాదు అని స్పష్టం చేసింది.

 కరోనా వైరస్ ప్రయోగశాలల్లో సృష్టించినది కాదని , చైనా లోని జంతువుల ద్వారా పుట్టుకువచ్చిందేనని భావిస్తున్నట్లు ప్రపం చ ఆరోగ్య సంస్థ ప్రకటించింది . అయితే అది జంతువుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించిందన్నది కనుగొనాల్సి ఉందని పేర్కొంది .

 ఇప్పటివరకు తమవద్ద ఉన్న ఆధారాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని స్పష్టం చేసింది . వ్యూహన్ లో కరోనా వైరసన్ను సృష్టించారా , చైనా ల్యాబ్ నుండి పొరబాటున బయటపడిందా అన్న విషయంలో దర్యాప్తు చేయాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం చేసిన ప్రకటన చేశారు .

 చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి డబ్లు హెచ్ వో ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అంటూ నిధులను నిలిపివేశారు . డబ్ల్యూహెచ్ఓకు అందే నిధుల్లో సింహభాగం ఒక్క అమెరికాయే చెల్లిస్తున్న విషయం తెలిసిందే .

 ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రకటన చేయడం విశేషం . ఆ సంస్థ ప్రతినిధి ఫడెలా చాయిబ్ జెనీవా కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు . నిధుల నిలిపివేతపై ట్రంప్ ప్రకటనను , తదనంతర పరిణామాలను సమీక్షిస్తున్నామని , కరోనా తోపాటు అనేక ఆరోగ్య కార్యక్రమాలకు నిధులు అవసరమని ఆమె పేర్కొన్నారు . 

Related Articles

Back to top button