తెలంగాణలో కుటుంబం మొత్తం ఆత్మహత్య, Family suicide in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా , ధరూర్ మండలం దోర్నాల గ్రామానికి చెందిన సువర్ణబాయ్ , హరీష్ , గిరీష్ , స్వప్న Family suicide in Telangana కుటుంబం మొత్త ఆత్మహత్య చేసుకున్నారు.

బుధవారం సాయంత్రం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల అల్మాగూడ బీఎస్ఆర్ కాలనీలోని శ్రీసాయితేజ హైట్స్ అపార్ట్మెంట్ లోని ఐదవ అంతస్తులో గల గదిలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు . ఈ ఘటన స్థానికులు , బంధువులను కలిచివేసింది .

ఆత్మహత్యకు ఆర్థిక కష్టాలే కారణామాని పోలీసులు అనుమానిస్తున్నారు ఏడాదికిపైగా అల్మాగూడలో నివాసముంటున్న సువర్ణ బాయ్ కుటుంబంలోని పెద్ద కొడుకు హరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు . అయితే వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని , ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితులతో ఆర్థిక కష్టాల నుంచి బయట పడలేమని భావించిన ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు .

ఈ మేరకు నలుగురు కలిసి ఒకేసారి Family suicide in Telangana ఆత్మహత్య చేసుకున్నారు . అయితే ఆత్మహత్యకు ముందు మూడు లెటర్లు రాశారు . అవి ఘటనా స్థలంలో దొరికాయి . రెండు లెటర్లలో దయచేసి చదవండి , అని ఉండగా మరో లెట , డోర్ తెరవండి ప్లీజ్ అని అతికించి ఉంచారు .

అయితే వీరి తలుపులు ఎంతకు తెరవక పోవడం స్థానికులు అనుమానం వ్యక్తం చేసి వెంటనే ఆ తలుపులు తెరిచిచూడగా విగత జీవులుగా కనిపించారు . దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ టర్లను స్వాధీనం చేసుకుని , వారి బంధువులకు సమాచారం అందించారు . 

మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు . ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు . ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది . 

Related Articles

Back to top button