APలో ఆగని కరోనా కేసులు, CoVID19 cases tally in AP

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది . తాజాగా మంగళవారం CoVID19 cases tally in AP 82 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి . దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1 , 259కి చేరింది . నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 40 , కృష్ణా జిల్లాలో 13 , గుంటూరు జిల్లాలో 17 , కడప జిల్లాలో 1 , అనంతపురం జిల్లాలో 1 , చిత్తూరు జిల్లాలో 1 , నెల్లూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి .

 రాష్ట్రంలో CoVID19 cases tally in AP తీవ్రత పెరుగుతండగా కోలుకుని డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది . వైద్యుల చికిత్సలు సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 258 మంది కరోనా బారి నుంచి కోలుకుని , ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు . ప్రస్తుతం రాష్ట్రంలో 970 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి . గడిచిన 24 గంటల్లో మొత్తం 5 వేల 783 కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు . సోమవారం , మంగళ వారాల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు . ఇప్పటివరకు 31 మంది కరోనా బారిన పడి మరణించారు . 

రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరుగుటకు ప్రభుత్వ అసమర్థత కారణమని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు . ప్రజారోగ్యం కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమనే వ్యవహారశైలి ఈ పరిస్థితి కారణమైందన్నారు . శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీ , నగరిలో పూల మధ్య ప్రారంభోత్సవాలు , పొరుగు రాష్ట్రాల నుంచి అనుచరుల తరలింపు , బహిరంగ సభలు పెట్టడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుబట్టిందని విమర్శించారు .

 వలంటీర్ల వేతనాలకు రూ . కోట్లు ఖర్చు చేస్తూ కూడా రేషనను ఇంటింటికీ పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు . చౌక డిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైందన్నారు . వైసీపీ నేతలు యథేచ్చగా రాష్ట్ర మంతా తిరుగుతూ సూపర్ స్పైడర్లుగా తయారయ్యారనే అభిప్రా యం సర్వత్రా నెలకొందన్నా రు . ఏదేశంలో చూసినా రోజూ వేల మంది కరోనా బారిన పడుతున్నారని , వారం రోజుల్లోనే మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .

 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుందని తాను అనుకోలేదని , దేశం , రాష్ట్రం ఒక అసాధారణ , సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు . కరోనా భయోతాంతం మన జీవితాలతో పాటు జీవనోపాధినీ ప్రమాదంలోకి నెట్టిందని అన్నారు.

 వేలం ఆలస్యం కారణంగా పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు . పొరుగు రాష్ట్రంలో కొన్న ధాన్యంలో పదోవంతుకూడా మన రాష్ట్రంలో కొనకపోవడం శోచనీయమన్నారు . పంట ఉత్పత్తులను ముందే సేకరించుంటే అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లేది కాదన్నారు . 

Related Articles

Back to top button