అధికారుల ఓవరాక్షన్ తో గర్భిణీ నరకయాతన, Roads blocked in Andhra border
Roads blocked in Andhra border సరిహద్దులు మూసివేయాలంటే బారికేడ్లు ఏర్పాటు చేయాలి . కానీ వీరు మాత్రం ఏకంగా గోడలనే నిర్మిస్తున్నారు . కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని వెల్లూర్ వద్ద ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్ద రోడ్డుపై రెండు కాంక్రీట్ గోడలను తమిళనా డు ప్రభుత్వం నిర్మించింది . దీన్ని చూసిన ఆంధ్ర వాసులు ఆశ్చర్యపోయారు . రోడ్డును బ్లాక్ చేయడానికి రాత్రికి రాత్రి నిర్మించిన ఈ గోడ వెడల్పు 3 ఫీట్లు , ఎత్తు 5 ఫీట్లు ఉంది .
వెల్లూర్లో వైద్య సదుపాయాలు బాగుంటాయి . ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద ఆస్పత్రులు ఉన్నాయి . ఆంధ్రప్రదేశ్ వాసులను ఇక్కడ రాకుండా ఉండేందుకు ఈ గోడను తమిళనాడు సర్కార్ కట్టింది. పురిటి నొప్పులతో బాదపడుతున్నా ఒక మహిళను గ్రామస్తులు ఆటోలో కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చూసారు . అయితే దిగువరాయగూడ నుండి ఒడిషా సరిహద్దు వరకూ ఆటోలో తీసుకువచ్చినప్పటికీ , ఒడిషా అధికారులు అత్తిపంచాయతీకి వెళ్లే రహదారికి నివగాం వద్ద పెద్ద గోతులు ఉండడంతో ఆ నిండు గర్బిణీని గ్రామానికి చెందిన యువకులు డోలీ కట్టి , గోతిని దాటించి అక్కడి నుండి మరో ఆటోలో కొంత దూరం తీసుకువెళ్లిన తరువాత 108 అంబులెన్స్ సహాయంతో కొత్తూరు ఆసుపత్రిలో చేర్పించారు . అదృష్టవశాత్తూ వాణిశ్రీ ఆసుపత్రిలో చేరిన తరువాతే ప్రసవం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు .
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జె . నివాస్ అధికారుల సహాయంతో ఆగోతులు మంగళవారం కప్పించారు . ఈ పరిస్థితి ఒక్క అత్తి పంచాయతీలోనే కాకుండా ఆంధ్రా ఒడిషా సరిహద్దుకు చెందిన అన్ని ప్రాంతాల్లోనూ ఉంది . ముఖ్యంగా మెళియాపుట్టి పక్కనే మహేంద్రతనయనది సమీపంలో ఇదే విధంగా గుంతలు తవ్వారు . అలాగే చాపర గ్రామం నుండి మహేంద్రతనయ నది దాటిన తరువాత ఒడిషా సరిహద్దులో కూడా పెద్ద గోతులు తవ్వారు . ఈ కారణంగా ఆ మార్గాల్లో వాహన రాకపోకలు నిలచిపోయినప్పటికీ , అత్యవసర సేవలకోసం వెళ్లే పరిస్థితి లేక ఆంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు .
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలు ఒడిస్సా సరిహద్దు గ్రామాల ప్రజలు తమ మండల పరిధిలోని ఆసుపత్రులకు వెళ్లాలంటే తమ గ్రామం నుంచి బయలు దేరి కొంతదూరం ఒడిషాలోని రహదారుల మీదుగా మళ్లీ తమ మండల పరిధిలోని ఆసుపత్రులకు చేరుకోవలసి ఉంటుంది . అయితే ఇప్పుడు జిల్లాలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఒడిషా అధికారులు Roads blocked in Andhra border రహదారులు తవ్వేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆయా మార్గాలను సరిచేసే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని పాతపట్నం నియోజకవర్గంలోని ఆయా సరిహద్దు మండలాల ప్రజలు కోరుతున్నారు .
వెల్లూర్ లో పాల ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . వేరే మార్గం ద్వారా వీరంతా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పాలు విక్రయించి వెళ్లిపోతున్నారు . ప్రతీ రోజు 10 వేల లీటర్ల పాలు సరిహద్దు దాటుతాయి .