APలో విజృంభిస్తున్న కరోనా, వెయ్యి దాటిన కేసులు, Corona rapidly increasing in AP

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,000 దాటింది . గడిచిన 24 గంటల్లో Corona rapidly increasing in AP 61 తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి . దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 1016కు కేసులు చేరుకున్నాయి .

 శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మొత్తం 6928 నమూనాలను పరీక్షించగా , 61 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది . కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాజిల్లాలో 25 , కర్నూలులో 14 , నెల్లూరులో 4 , కడపలో 4 , గుంటూరులో 3 , తూర్పుగోదావరిలో 3 , అనంత పురంలో 5 కేసులు నమోదయ్యాయి . 

 ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదవ్వని శ్రీకాకుళం జిల్లాలో కూడా మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి . దీంతో రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లా మినహాయించి  అన్ని జిల్లాల్లో కరోనా వ్యాపించనట్లైంది . శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో కరోనా కేసులు వెలుగుచూశాయి . ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మార్చి నెలలో ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చాడు . ఆయన ద్వారా అతని కుటుంబంలోని ముగ్గురికి కరోనా వైరస్ సోకింది . అతనికి మాత్రం ప్రస్తుతానికి నెగిటీవ్ రిపోర్టు వచ్చింది .

 మరోవైపు కృష్ణాజిల్లాలో ఒకరు , కర్నూలు జిల్లాలో మరొకరు కరోనా మరణించారు . దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 31కు చేరుకుంది . అలాగే Corona rapidly increasing in AP కరోనా తో కోలుకుని 171 మంది హాస్పటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు . కృష్ణా జిల్లాలో పరిస్థితి ఆందోళనకరం కృష్ణా జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది . ఇద్దరు లారీ డ్రైవర్ల నిర్వాకం వల్ల 89 మంది కరోనా బారిన పడ్డారు .

 కృష్ణలంకకు చెందిన ఒక లారీ డ్రైవర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి , ఇచ్చాడు . ఈ క్రమంలో అతనికి ఏమీతోచక , కాలక్షేపం కోసం ఇరుగుపొరుగువారిని పిలిచి పేకాట ఆట ఆడాడు . దీంతో అతనితోపాటు ఆట ఆడిన వారికి , అతని కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 24 మందికి కరోనా సోకింది . ఇంకా పదుల సంఖ్యలో క్వారెంటైన్లో ఉన్నారు . 

 విజయవాడ కార్మికనగర్‌కు చెందిన లారీ డ్రైవర్ కూడా తిరిగి వచ్చి , ఇరుగుపొరుగువారిని కలిశాడు . ఈ క్రమంలో అతని నిర్లక్ష్యం వల్ల 15 మందికి కరోనా సోకింది . దీంతో బెజవాడ ప్రజానికం భయంతో వణికిపోతున్నారు . కనీసం ఇంటిలోనుంచి ఆరు బయటకు కూడా అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది . తాజా కేసులతో కృష్ణాజిల్లాలో కేసుల సంఖ్య 127కు చేరుకుంది .

Related Articles

Back to top button