APలో కరోనా విలయతాండవం, Total CoVID19 cases in AP

 రాష్ట్రంలో కరోనా వైరస్ పెను ఉత్పాతం సృష్టిస్తోంది . Total CoVID19 cases in AP tally 1177 రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు కరోనా విశృంఖలంగా విజృంభిస్తూనే ఉంది . ఈ క్రమంలో తాజాగాను రాష్ట్ర వ్యాప్తం గా 80 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి . 

 వరుసగా మూడు రోజుల పాటు 80 లేదా అంతకుమించి ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా ఏపీ నిలిచింది . ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1100లు దాటింది . గడిచిన 24 గంటల్లో 6517 నమూనాలను పరీక్షించగా 80 మంది పాజిటివ్ రావటంతో , ప్రస్తుతం Total CoVID19 cases in AP tally 1177 సంఖ్యకు చేరుకుంది .

 కొత్తగా రిపోర్ట్ అయిన కేసుల్లో కృష్ణాజిల్లాలో 38 పాజిటీవ్ కేసులు వచ్చాయి . దీంతో కృష్ణాలో కేసుల సంఖ్య 210కు చేరుకుంది . తర్వాత గుంటూరు జిల్లాలో 23 కేసులు రిపోర్టయ్యాయి . దీంతో గుంటూరులో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 237కు ఎగబాకింది . కర్నూలులో 13 కేసులు తాజాగా నమోదుకాగా , మొత్తం కేసుల సంఖ్య 292కు చేరుకుంది . నెల్లూరులో 7 , శ్రీకాకుళంలో 1 కేసు చొప్పున నమోదయ్యా యి .

 మరో వైపు గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకుని , హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు . దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి బయటపడిన వారి సంఖ్య 235కు చేరుకుంది . 

 ఇప్పటి వరకు రాష్ట్రంలో 74 , 551 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు . రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి 1 , 396 మందికి నిర్ధారణ పరీక్షలు గావిస్తున్నారు . దీంతో దేశంలోనే అత్యధికంగా కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచి , కొనసాగుతోంది . కాగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్టుల ప్రకారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన సంఖ్య 1.58 శాతంగా ఉంది .

 కరోనాను ఆదిలోనే కట్టడి చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి రోజూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వ్యాధి మరింత ఉధృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు . ఈ 3 జిల్లాల్లో పర్యటించిన ఉన్నతాధికారుల బృందం అక్కడి కలెక్టర్ , ఎస్పీ , పోలీసు , రెవెన్యూ , వైద్య , ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వ్యాధి తగ్గుముఖానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు . వారి పర్యవేక్షణలో వ్యాధి కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది .

Related Articles

Back to top button