సూర్యాపేటలో కరోనా విజృంభణ,83కు చేరిన కేసులు, 83 corona cases in Suryapet

  సూర్యాపేటలో కరోనా విజృంభిస్తోంది, 83 corona cases in Suryapet కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది . బుధవారం వెలువడిన పాజిటీవ్ కేసుల నిర్ధారణతో 3కొత్త కేసులు నమోదు అయ్యాయి .

 జిల్లాలోని తిరుమలగిరి , వర్తమానుకోట , పోలుమల్ల , ఏపూర్ , బీబీ గూడెం , అనంతారం లతో పాటుగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే .

 ఈ నెల 2న ప్రారంభం అయిన కరోనా పాజిటీవ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతూ వస్తోంది . మంగళవారం ఒక్క రోజే 54గా ఉన్న సంఖ్య నుంచి 26కు పెరిగి 80కు చేరిన విషయం తెలిసిందే . దీంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూర్యాపేట జిల్లాలో ఒక్క సారిగా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరుపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని నిర్ణయించి రాష్ట్ర ఉన్నతాధికారుల బృందాన్ని పంపించారు.

 83 corona cases in Suryapet ఆయా అధికారుల బృందం జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించి నివారణ కోసం చేపట్టవలసిన చర్యలను వివరిస్తూ జిల్లా అధికారులకు దిశదశ నిర్దేశాన్ని చేశారు .

సూర్యాపేట మార్కెట్ ఏరియాలో మరో మూడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయినట్లు డీఎంహెవో సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . మూడు అర్బన్ హెల్త్ సెంటర్స్ , చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బీబీ గూడెం తండాలో ఇంటింటికీ సర్వే కార్యక్రమం నిర్వహించి 52 హెల్త్ టీంల ద్వారా 3216 నివాసాల్లో 14886 మంది జనాభాను సర్వే చేసినట్లు తెలిపారు .

 ప్రభుత్వ క్వారంటైన్‌ ఇమాంపేట , టీఎస్ మోడల్ స్కూల్ , అరవిందాక్ష , లయోలా కళాశాల మరియు తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 187 మందిని ఉంచి ఆరోగ్య పర్యవేక్షణతో పాటు పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు . రెడ్ జోన్ ఏరియాలతో పాటు పలు ఏరియాల్లో ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పించినట్లు వెల్లడించారు .

Related Articles

Back to top button