డిశ్చార్జ్ అయిన వారికి 2వేలు ఇవ్వనున్న ప్రభుత్వం, 2thousand for corona patients

 కోవిడ్ – 19 నుండి కోలుకుని డిశ్చార్జి అయిన వారందరికీ 2thousand for corona patients . 2 వేల వంతున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు .

 తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం కోవిడ్ – 19 నివారణా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ , కేంద్ర మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసినట్లు అధికారులకు చెప్పారు . కోవిడ్ – 19 నియంత్రణా చర్యలను అడిగి తెలుసుకుని , సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు .

 రాష్ట్ర వ్యాప్తంగా 231 మంది కోవిడ్ నుండి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారని వారందరికీ కూడా 2thousand for corona patients . 2 వేల వంతున ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు . ఈ కోవిడ్ – 19 లాంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ముమ్మరంగా సాగాలని సీఎం స్పష్టం చేశారు .

 నాడు – నేడు కింద ప్రతిపాదించిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు . ఇలా మౌలిక సవతులను పెంచితే వివిధ రోగాల నుంచి ప్రజల ప్రాణాలను నిలుపుకోగలమని ముఖ్యమంత్రి చెప్పారు . అలాగే కోవిడ్ -19 యేతర ఎమర్జెన్సీ కేసులపైనా దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు .

 ప్రతి మిలియన్ జనాభాకు 1 , 274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు . ఆదివారం కేంద్ర మంత్రి షా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి , ఏప్రిల్ 20 నుండి ఇచ్చిన సడలింపులు , వాటి అమలుపై వివరాలడిగి తెలుసుకున్నారు .

 ఈ సందర్భంగా గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన మత్స్య కారులను తీసుకొచ్చే అంశంపైన కేంద్రం తరపున నోడల్ మినిషర్‌గా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామతో చర్చించినట్లు సీఎం చెప్పారు . ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ఆధికారి సతీష్ చంద్ర చూసుకుంటారని చెప్పారు . ఆమేరకు నిర్మలాసీతారామన్ కార్యాలయం నుండి కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు . ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి తెలుగు మత్స్యకారులను గుజరాత్ నుండి ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానంటూ నిర్మలాసీతారామన్ చెప్పారని సీఎం కేంద్రమంత్రి షాకు వివరించారు .

Related Articles

Back to top button