తగ్గుతున్న కరోనా, 2 కొత్త కేసులు, Corona positive cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో 2 Corona positive cases in Telangana ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు , అమలు చేస్తున్న విధానాలే పాజిటివ్ కేసులు తగ్డాడనికి కారణంగా వైద్యరంగంలోని నిష్ణాతులు అభిప్రాయపడుతు న్నారు .

ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూ వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్నప్పటికీ , తెలంగాణలో మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనాను కట్టడి చేయగలిగారన్న భావన ప్రజల్లో ఏర్పడింది . 

 సోమవారం కేవలం 2 Corona positive cases in Telangana పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వచ్చే నాలుగైదు రోజుల్లో ఈ సంఖ్య జీరోకి వస్తుందని , ఆ తర్వాత ఇక పాజిటివ్ కేసులే లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించనున్నదన్న భావన అటు ప్రజల్లో , ఇటు ప్రభుత్వంలో నెలకొన్న రాష్ట్రంలోని గ్రామాల్లో సైతం ప్రజలు ఈ వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన పెంచుకుని ఇతర ప్రాంతాల వారిని వారి గ్రామాలకు రాకుండా కట్టడి చేయడం వైరస్ ఉధృతి తగ్గడానికి కారణమని అంచనా వేస్తున్నారు .

 లాక్ డౌనను మరింత పకడ్బంధీగా అమలు చేయడంతోపాటు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని కట్టడి చేయడం వల్ల కరోనా ఉధృతి తగ్గినట్లు భావిస్తున్నారు . కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించడం , ఆ కాలనీల్లో ఉంటున్న వారిని బయటకు రాకుండా చేయడం కూడా కరోనా తగ్గటానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు .

 హైదరాబాద్ జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి . పలు జిల్లాల్లో తగ్గిన కేసులు నిన్నమొన్నటి దాకా వైరస్ ఉధృతి బాగా ఉందన్న ప్రచారం జరిగిన సూర్యాపేట , వికారాబాద్ , జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ వైరస్ తగ్గినట్లు తాజా గణంకాలను బట్టి తెలుస్తోంది . నాలుగైదు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనూ వైరస్ ఉధృతి తగ్గిపోతుందన్న ధీమా అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది .

మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని కేవలం 36 గంటల్లోనే గుర్తించడం , వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి రక్త నమూనాలను సేకరించి , గాంధీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే . ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది ఇప్పటికే వ్యాధి నయమై వారి ఇళ్లకు వెళ్లిపోగా ఇటీవల చేరిన వారంతా ఈ నెల చివరిలోపు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది .

Related Articles

Back to top button