Trending

భారత్ లో కరోనా విలయతాడవం, Corona india tally

భారత్ లో కరోనా విలయతాడవం చేస్తుంది. Corona india tally 1.25lackhs కరోనా లాక్ డౌన్ ఇక ఇదే చివరి లాక్ డౌన్ అని సంకేతాలిస్తున్న ప్రభుత్వ కార్యాచరణకు భిన్నంగా దేశంలో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి . గడచిన 24 గంటల్లో పెరుగుతున్న తీరును గమనిస్తే గంటకు 264 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . అదేవిధంగా గంటకు ఐదుగురు చొప్పున మృతి చెందారు . వీరంతా అదనంగా నమోదయిన కేసులే కావడం గమనార్హం .

Corona india tally ::

మొత్తం కేసులు కూడా 1.25 లక్షలకు పైబడ్డాయి . వీరిలో మొత్తం 3720 మంది మృతిచెందినట్లు తేలింది . గత 24 గంటల్లోనే పాజిటివ్ కేసులు 6654 వరకూ పెరిగితే మరణాలు సైతం 137 పెరిగాయి . ప్రపంచ వ్యాప్తంగా లక్షకేసులు దాటిన దేశాల్లో 11 వ దేశంగా భారత్ చేరింది . అదేస్థాయిలో చికిత్స పొందుతున్న కేసుల్లో రికవరీ కేసులు కూడా పెరగడం కొంత శుభవరిణామం . మరోపక్క రికవరీ అయిన కేసులు 51,784 కి పెరిగాయి . ఒక్కరోజే 3250 మంది పెరగడం భారత్ చికిత్స విధానాల్లో మెరుగైన ఫలితాలిస్తున్నట్లు స్పష్టం అవుతోంది . ఇక చికిత్స పొందుతున్న 69 వేల 597 కేసుల్లో ఒకే రోజు 3267 కేసులు పెరిగాయి . రిక వరీరేటు , మరణాలశాతం జాతీయ , అంతర్జాతీయ సగటుకంటే తక్కువగానే ఉన్నా పాజిటివ్ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది .

 ఈనెల 31 వ తేదీతో మూడోవిడత  లాక్ డౌన్ కూడా పూర్తి అవుతున్నది . కేవలం మహారాష్ట్ర , గుజరాత్ , న్యూఢిల్లీ , తమిళనాడు , రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువ పెరుగుతున్నట్లు తేలింది . ఐదు వందలకుపైబడిన కేసులు మహారాష్ట్రను మినహాయిస్తే తమిళనాడు , గుజరాత్ , మధ్యప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ , ఢిల్లీలో నమోదయ్యాయి . ఐదువేలకు పైబడిన కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నాయి . భౌతికదూరం పాటించాలని , ఫేస్ మాస్క్ లేకుంటే శిక్షార్హమైన నేరంగా భావించి కేసులు నమోదుచేస్తా మని హెచ్చరికలుచేసారు .

 మరోపక్క రాత్రి ఏడునుంచి ఉదయం ఏడువరకూ కర్ఫ్యూతరహా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు . కంటైన్మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా దేశంలో పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం . మరోపక్క వలస జీవులు రాక ప్రారంభం అయిన తర్వాత ఉత్త రాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగాయి . బీహార్ లో 179 కేసులు , జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ , అస్సా 0 లలో కూడా కేసులు పెరిగాయి . కాగా లడక్ , అండమాన్ , మణి పూర్ , మేమా లయ , మిజోరం , దాద్రానగర్ , త్రివుర , నాగా లాండ్ , అరుణాచల్ ప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో ఒక్కకేసు కూడా నమోదు కాకపోవడం విశేషం . ఇక మహారాష్ట్ర పరంగా చూస్తే మొత్తం కేసులు 44,582 కి పెరిగాయి . ఒక్క రోజులోనే 2940 పాజిటివ్ నమోదయ్యాయి . మరణాల పరంగా చూస్తే 63 మంది పెరిగి 1517 కి చేరింది .

Related Articles

Back to top button