భారత్ లో కరోనా ఉగ్ర రూపం, Coronavirus cases india tally
భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. Coronavirus cases india tally 1,45,380 రోజులు గడిచేకొద్దీ కేసుల నమోదు సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది . మంగళవారం నాటికి దేశంలో 1,45,380 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా , 4,167 మంది వైరస్ భారిన పడి మృతిచెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది .
24 గంటల వ్యవధిలో 6,535 కేసులు నమోదు కాగా , 146 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది . సోమవారం నాటికి భారత్ కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైన టాప్ 10 దేశాల జాబితాలో చేరింది . అదే రోజువారీగా నమోదవుతున్న కేసుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే భారత్ నాలుగో స్థానంలో ఉంది . రోజువారీగా భారత్ కంటే ఎక్కువ కేసులు వస్తున్న దేశాల్లో భారత్ కంటే అమెరికా , బ్రెజిల్ , రష్యాలు ముందున్నాయి . దీన్ని బట్టి చూస్తుంటే లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత దేశంలో కరోనా జడలు విప్పిన విషయం స్పష్టమౌతోంది . అప్పటివరకూ 2 , 3 , 4 వేల మధ్య నమోదవుతున్న కేసులు ఇటీవల వారం రోజులుగా మరింత తీవ్రమై 5 , 6 వేలకు పైగా నిర్ధారణ అవుతుండడం గమనార్హం .
Coronavirus cases india tally details:
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 80,722 కు పెరగ్గా , రికవరీ అయిన వారి సంఖ్య 60,490 గా ఉదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది . కరోనా బాధితుల్లో కోలుకుంటున్న వారి శాతం 41.61 కు చేరిందని మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు . అయితే దేశంలో రికవరీ రేటు గురించి చెబుతున్న ఆ అధికారి దాదాపు అదేవిధంగా ఉన్న గ్లోబల్ రికవరీ రేటు గురించి ప్రస్తావించలేదు . మే 25 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా భారిన పడిన వారిలో 41.84 శాతం మంది కోలుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి .
మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి . దేశంలో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో 1,695 మరణాలతో ఆ రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది . తరువాతి స్థానాల్లో గుజరాత్ ( 888 ) , మధ్యప్రదేశ్ ( 300 ) , పశ్చిమబెంగాల్ ( 278 ) , ఢిల్లీ ( 276 ) లు ఉన్నాయి మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో రెండు , మూడు అంకెల్లో ఉన్న మరణాల సంఖ్య కేరళలో ఉంది . దాదాపు 70 శాతం మేర మరణాలు బాధితులకు ఉన్న సహ అనారోగ్యాల కారణంగా సంభవించాయని మంత్రిత్వశాఖ వెబ్ సైట్ పేర్కొంది .
ఇక కేసుల నమోదు గణాంకాలను పరిశీలిస్తే మహరాష్ట్రలో అధిక స్థాయిలో 52,667 పాజిటివ్ కేసులు తేలగా . , ఆ సంఖ్య తమిళనాడులో 17,082 , గుజ రాత్ లో 14,460 , ఢిల్లీలో 14,053 , రాజస్థాన్‌లో 7,300 , మధ్యప్రదేశ్ లో 6,859 , ఉత్తరప్రదేశ్ లో 6,532 గా ఉంది .
2 Comments