రాష్ట్రంలో కొత్తగా 43 కరోనా కేసులు, 809 corona cases in Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది . శనివారం రాష్ట్రంలో 43 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 809 corona cases in Telangana శనివారం నమోదైన 43 పాజిటివ్ కేసులు కలుపుకుంటే రాష్ట్రంలో కోవిడ్ – 19 బారిన పడిన పాజిటివ్ కేసుల సంఖ్య 809కు చేరింది.
కరోనా పాజిటివ్ గా వచ్చిన 605మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకుని శనివారం నాటికి 186మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18మంది కరోనాబారిన పడి మృత్యువాత పడ్డారు.
మొత్తం 809 corona cases in Telangana శనివారం నమోదైన 48 కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 31 కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు ఇక్కడ 317 పాజిటివ్ కేసులు నమోదు కాగా 131 మంది కోలుకున్నారు . మిగిలినవి గద్వాల 7 , సిరిసిల్లలో 2 , రంగారెడ్డిలో 2 , నల్గొండలో 1 పాజిటివ్ కేసు నమోదయింది.
రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది . కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్‌కు తరలిస్తున్నా పాజిటివ్ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది . రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది . అయితే ప్రజలు మాత్రం లాక్ డౌన్ నిబంధనలను పాటించడం లేదు . ఏదో ఒక పనితో ఇళ్ల నుంచి బయటకు వస్తూనే ఉన్నారు . దీంతో కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కరోనా వైరస్ ఎలా సోకిందన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది .
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది రాచకొండ మధుర నగర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది . దీంతో అధికారులు , పోలీసులు బాధితుడి కుటుంబంతోపాటు స్థానికులందరినీ ఆసుపత్రికి తరలించారు.
దాదాపు 40మందికి పైగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి . కరోనా సోకిన వ్యక్తి రెండు , మూడు రోజుల క్రితం సుమారు 50మందికి అన్నదానం , నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు పోలీసులు గుర్తించారు .
ఈ కార్యక్రమాన్ని నేరేడ్మెట్ పోలీసులు పర్యవేక్షించారు . దీంతో పీఎస్ పరిధిలోని పోలీసులు , స్థానికులందరికీ వైద్య పరీక్షలు చేస్తామని వైద్యాధి కారులు చెబుతున్నారు .
One Comment