Trending

మంచిర్యాలలో కొనసాగుతున్న కరోనా ఉదృతి, mancherial district Corona cases

మంచిర్యాల జిల్లాలో తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసుల నమోదు mancherial district Corona cases 1182 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ ఆగడం లేదు .. మహమ్మారి జిల్లాపై పంజా విసురుతోంది .. తాజాగా మంగళవారం జిల్లాలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి నీరజ తెలిపారు . మరో 24 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందన్నారు . జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 182 కు చేరింది . 

mancherial district Corona cases మొత్తం 182 కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య -ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 53 మంది , 127 మంది డిశ్చార్డ్ కాగా ఇద్దరు మృతి చెందారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నీరజ హెల్త్ బులిటనను విడుదల చేశారు . బెల్లంపల్లికి చెందిన ఇద్దరికి , మంచిర్యాలకు చెందిన ఒకరికి కరోనా పాజిటీవ్ నమోదైనట్లు ఆమె పేర్కొన్నారు .  రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాపార , వాణిజ్య సంస్థలు తమ వ్యాపార సమయాలను తగ్గించుకుంటున్నాయి . పలు కార్యాలయాలు మూతపడ్డాయి . జిల్లాలోని ఒక తహశీల్దార్ చికిత్స పొందుతూ మృతి చెందగా ఆ విభాగానికి చెందిన అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు .

 రెవెన్యూ కార్యాలయాలకు రాకుండానే ఆన్లైన్ ద్వారా ఆర్జీలు పెట్టుకోవాలని , ఆ విధంగానే సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొంటున్నారు . పలు కార్యాలయాల ఆవరణ బయటే ఫిర్యాదులకు సంబంధించిన బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు . ప్రజలు స్వీయ నియంత్రణతో భౌతిక దూరం పాటించాలని , మాస్కులు ధరించాలని , ఎప్పటికప్పు డు శానిటైజర్లను ఉపయోగించాలని , తరచూ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని , అత్యావసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు .

Related Articles

Back to top button