రాష్ట్రాన్ని వణికి స్తున్న కరోనా మహమ్మారి, Telangana COVID positive cases
రాష్ట్రాన్ని వణికి స్తున్న కరోనా మహమ్మారి బారినపడి తాజాగా మరో 10 మంది మృతి చెందగా , Telangana COVID positive cases 1,676 కొత్త కేసులు నమోదయ్యాయి . ఈ మేరకు 14,027 నమూనాలను వైద్యశాఖ పరీక్షలు చేసింది . జీహెచ్ఎంసీలో అత్యధికంగా 778 కేసులు నమోదు కాగా , రంగారెడ్డిలో 224 , మేడ్చల్ 160 , కరీంనగర్ 92 , సంగారెడ్డి 57 , ఖమ్మం 10 , కామారెడ్డి , సిద్దిపేట , గద్వాల జిల్లాల్లో 5 చొప్పు న నమోదయ్యాయి .
Telangana COVID positive cases ::
వరంగల్ రూరల్ , జగి త్యాల , యాదాద్రి , జనగాం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున , వరంగల్ అర్బన్లో 47 , మహ బూబాబాయ్ 19 , పెద్దపల్లి , నారాయపేట జిల్లాల్లో 7 చొప్పున , మెదక్ 26 , మహ బూబ్ నగర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 6 చొప్పున , మంచిర్యాల 4 , భూపాలపల్లి 8 , నల్గొండ 64 , సిరిసిల్ల 3 , వికారాబాద్ 8 ,నాగర్ కర్నూల్ 30 , నిజామాబాద్ 20 , వనపర్తి 51 , సూర్యాపేట 20 కేసులు నమోదైనట్టు వైద్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది . కాగా ఇప్పటి వరకు కరోనాకు గురైన వారు 41,018 మంది , కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 27 , 295 మంది . మృతుల సంఖ్య 396 కు చేరుకుం ది . డిశ్చార్జ్ రేటు 67 శాతంగా నమోదైంది . వివిధ ఆసుపత్రుల్లో 11,060 ఐసో లేషన్ పడకలు , 2,962 ఆక్సిజన్ పడకలు , 1,367 ఐసీయూ పడకలు మొ త్తం 15,889 పడకలు ఖాళీగా ఉన్నా యని వైద్యశాఖ పేర్కొంది .
ఏపీలో కూడా కరోనా కేసులు రికార్డు స్థాయిలో 2584 నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది . ఇప్పటి వరకు నమోదైన కేసులు పరిశీలిస్తే గురువారం బయటపడ్డ కేసులే అత్యధికం కావడం శోచనీయం . గడచిన 24 గంటల్లో 22,304 నమూనాలను పరీక్షించగా 2584 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య , ఆరోగ్య శాఖ బులిటెన్లో స్పష్టం చేసింది . టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్ది కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి . ఇదే క్రమంలో మరణాల సంఖ్య కూడా గణనీ యంగా పెరుగుతూ వస్తోంది . బుధవారం 44 మంది కరోనాతో మృతి చెందగా , గురు వారం 40 మంది ఈ వైరసకు బలయ్యారు .