మంచిర్యాల లో ఆగని కరోనా, Mancherial coronavirus cases

మంచిర్యాల  జిల్లాలో తాజాగా మరో 6 Mancherial coronavirus cases కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నీరజ తెలిపిన వివరాల ప్రకారం మం చిర్యాల పట్టణంలో 3 గురికి శ్రీరాంపూర్ ఒకరికి , బెల్లంపల్లిలో ఇద్దరు కరోనా వ్యా ధి సోకినట్లు నిర్ధారణ అయిందని ఆమె తెలిపారు . దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా బాదితుల సంఖ్య 179 కి చేరుకుంది . జిల్లాలో కరోనా వైరస్ ఉదృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది . ప్రజలంతా భయాందోళనకు గురి అవుతున్నారు .

కంటెన్మెంట్ జోన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది . 36 మందికి సంబంధించిన నమునా పలితాలు అందాల్సింది . ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి వివిధ ఆసుపత్రులలో చికిత్స పొంది 127 మంది డిశ్చార్జ్ అయ్యారు . 54 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . కరోనా ఉదృతి పెరుగుతూ ఉండడంతో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించాలని తప్పనిసరిగా అయితేనే ఇంట్లో నుండి బయటకు వెళ్లాలని చిన్నపిల్లలు , వృద్ధులు ఇంట్లో ఉండాలని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు . ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు .

Mancherial coronavirus cases ::

 శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే న్యూటెక్ గనిలో పనిచేస్తున్న ఒక యువకార్మికునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది . యువ కార్మికుడు శ్రీరాంపూర్ ఏరియాలోని వాటర్ ట్యాంక్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు . ఈ నెల 6 న కొంతఅస్వస్థతకు గురి కావడంతో పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు . అక్కడ నయం కాకపోవడంతో ఈ నెల 9 న కరీంనగర్ లోని చెల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోగా కరోనా పాజిటివ్ లక్షణాలు రావడంతో వెంటనే బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లి రక్తనమూనాలు ఇచ్చాడు .

 శనివారం రాత్రి ఆ యువకార్మికునికి కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం అందిచడంతో వెంటనే అతనిని హై ద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు . శ్రీరాంపూర్ ఏరి యా లోని వాటర్ ట్యాంక్ ఏరియాలో కరోనా కేసులు నమోదు కావడంతో అ ఏరియాలో వైద్యబృందాలు సందర్శించి వారి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు . అవార్డును క్వారంటైన్ జోన్ గా ప్రకటించారు . కాగా ఎస్ఆర్ పి -3 గనిలో మైనింగ్ స్టాప్ గా పనిచేస్తున్న ఓ కార్మికునికి మంచిర్యాల ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోగా కరోనా లక్షణా లు ఉన్నాయని నిర్ధారించడంతో బెల్లంపల్లి ఐసోలేషను పంపించారు . అయితే అక్కడ కరోనా పరీక్షలు ఇచ్చిన తర్వాత రక్తనమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు .

Related Articles

Back to top button