విశాఖలో భారీ పేలుడు, భయాందోళనతో ప్రజలు, Blast in Vishaka pharmacity

 విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో భారీ పేలుడు సంభవించింది. Blast in Vishaka pharmacity పేలుడు సంభవించిన వెంటనే పెద్దఎత్తున పొగ , , ఆ తరవాత అగ్నికీలలు ఎగసిపడ్డాయి . సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పెద్ద శబ్దం , భారీ స్థాయిలో మంటలు ఎగసి పడ్డాయి .

 ఈ ప్రమాదంలో విశాఖ సాల్వెంట్సకు అనుబంధంగా ఉన్న కోస్టల్ట్ ఎథిలియంట్ ట్రీట్మెంట్ రికవరీ ప్లాంట్‌లో ట్యాంక్ పేలిపోయింది . దీంతో భారీ స్థాయిలో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి . సుమారు 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించడంతో తానాం పరిసర గ్రామాల ప్రజలు పరుగులు తీశారు . ఆస్తి నష్టంతో పాటు , ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది . ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అధికారులతో పాటు 12 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి . అయితే మంటలు తీవ్రంగా ఉండటంతో ఫార్మాసిటీ వరకు వెళ్లలేకపోయాయి .

Blast in Vishaka pharmacity ::

 కొద్దిసేపటి తరువాత సంఘటన ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు . కాగా , నైట్ షిఫ్ట్ లో 65 నుంచి వంద మంది కార్మికులు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు . ఈ ప్రమాదం తీవ్రతకు 2 , 3 కిలోమీటర్ల దూరం వరకూ కాంతి , వేడి వ్యాపించింది . రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు . గాయపడిన సిబ్బందిని గాజువాకలో ఆర్కే ఆస్పత్రికి తరలించారు . ప్రమాదంలో నలుగురు గాయపడినట్లు కలెక్టర్ వినయ్ చంద్ చెబుతున్నారు . పది మంది గాయపడి ఉండ వచ్చని స్థానికులు భావిస్తున్నారు . సంఘటన స్థలానికి కలెక్టర్ వినయ్ చంద్ , ఆర్డీఓ కిషోర్ , ఎమ్మెల్యే అదీప్ రాజ్ , మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేరుకున్నారు . 

 ఈ ప్రమాదంపై మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించారు . పేలుడు జరిగిన తీరు , ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు . వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని , ప్రాణనష్టం సంభవించకుండా చూడాలని ఆదేశించారు . ఫార్మాసిటీలోని వేరు వేరు కంపెనీలో మందులు తయారుచేసే క్రమంలో వచ్చే ఒక రకమైన వృథా ఆయిలను తిరిగి శుభ్రం పరిచే ప్రక్రియ ఈ కంపెనీలో జరుగుతోంది . ప్రతి రోజు మాదిరిగానే రాత్రి పది గంటలకు నైట్ షిఫ్ట్ మొదలైన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది . ఇటీవల రసాయన వాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన సాయినాథ్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం .

Related Articles

Back to top button