Trending

తెలంగాణలో కరోనా విలయతాడవం, Coronavirus Telangana cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది . Coronavirus Telangana cases లాక్ డౌన్ తో పాటు వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు … ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు . నిన్నమొన్నటి వరకు జీహెచ్ఎం సీకే పరిమితమైన జీహెచ్ఎంసీ కేసులు గ్రామీణ జిల్లాలకు వ్యాపించాయి . గ్రామీణ జిల్లాల్లో పదుల సంఖ్యలో నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు మంగళవారం వందల సంఖ్యలకు చేరిపోయాయి .

 రాష్ట్రంలో కొత్తగా 1524 పాజిటివ్ నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది . కొత్త కేసుల నమోదుతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరువైంది . జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం 815 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు 37,745 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి . కాగా కరోనా చికిత్స పొంది 1161 మంది మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు . ఇప్పటి వరకు కోలుకుని 24,840 మంది ఇళ్ళకు వెళ్ళారు . ఇంకా 12,531 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు . ఇదిలా ఉండగా మంగళవారం 13,175 కరోనా పరీక్షలు నిర్వహించగా 1524 మందికి పాజిటివ్ గా తేలింది . రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రెండు లక్షలకు చేరువలో 1,95,024 కు చేరుకున్నది . ఇందులో 1,57,279 మంది నెగిటివ్ గా నిర్ధారణ కాగా 37,740 మందికి పాజిటివ్ గా తేలింది .

Coronavirus Telangana cases ::

 రాష్ట్రంలో కరోనాతో మృతి చెందుతున్న వా వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది . నెల రోజులుగా సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతూ వస్తుండగా మంగళవారం రెండంకెల సంఖ్య లో కరోనా మరణాలు సంభవించాయి . మరో 10 మంది మృతి చెందినట్లు బులెటిల్ లో పేర్కొంది . ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 375 కు చేరుకుంది . జిల్లాల వారీగా రంగారెడ్డి 240 , మేడ్చల్ 97 , సంగారెడ్డి 61 , ఖమ్మం 8 , కామారెడ్డి 19 , వరంగల్ అర్బన్ 30 , వరంగల్ రూరల్ 2 , నిర్మల్ 8 , కరీంనగర్ 29 , జగిత్యాల 2 , మెదక్ 24 , మహబూబ్ నగర్ 7 , మంచిర్యాల 12 , భద్రాద్రి – కొత్తగూడెం 8 , భూపాల ఎల్లి 12 , నల్గొండ 38 , సిరిసిల్ల 19 , ఆదిలాబాద్ 7 , ఆసిఫాబాద్ ‘ 5 , వికారాబాద్ 21 , నాగర్ కర్నూల్ 1 , జనగాం 4 , నిజామాబాద్ 17 , ములుగు 6 , వనపర్తి 5 , సిద్దిపేట 4 , సూర్యాపేట 15 , గద్వాల 13 కేసులు నమోదయ్యాయి . 

 తెలంగాణలో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో పీఐబీ రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తోందని ప్రజా  ఆరోగ్య శాఖ డైరెక్టర్ జి . శ్రీనివాసరావు ఆరోపించారు . తెలంగాణ రాష్ట్రం ఐసీఎంఆర్ విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందని స్పష్టంచేశారు .

Related Articles

Back to top button