మంచిర్యాల లో కరోనా ఉదృతి, Coronavirus cases in mancherial
మంచిర్యాల జిల్లాలో మరో 10 కేసులు కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య Coronavirus cases in mancherial 128 కి చేరింది. మంచిర్యాల జిల్లాలో కోవిడ్ -19 పాజిటీవ్ కేసులు నమోదు అవుుతూ ఉండటం తో జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది మంగళ వారం రాత్రి అందిన సమాచారం ప్రకారం 14 మందికి సంబంధించిన నమూనాలను పంపించగా అందులో 10 మందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయింది . దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాదితుల సంఖ్య 128 కి చేరుకుంది .
హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి జిల్లా కేంద్రానికి చెందిన మార్కెట్ రోడ్లో ఒక వ్యక్తికి , శ్రీశ్రీ నగర్ లో ఒకరికి , కైలాస నగర్ లో ఒకరికి కరోనా నిర్ధారణ కాగా నస్పూర్ మండలంలో ఇద్దరికి , మందమర్రిలో ఇద్దరికి వైరస్ సోకింది . మంచిర్యాల జిల్లాకు చెందినవారైనప్పటికీ ఒకరు వరంగల్ లో , మరొకరు గోదావరిఖనిలో ఉన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు జిల్లా కోవిడ్ -19 సమన్వయ అదికారి డాక్టర్ బాలాజి పేర్కొన్నారు . Coronavirus cases in mancherial ఇప్పటి వరకు వైద్య చికిత్స పొంది 61 మంది డిశార్జ్ అయ్యారని ఆయన తెలిపారు . పాజిటీవ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రాంతమంతా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తూ తగు జాగ్రత్తలు తీసు కుంటున్నారు .
రోజు రోజుకు కరోనా బాదితుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాపార , వాణిజ్య సంస్థలన్నీ సాయంత్రం 4 గంటల వరకే తమ కార్యకలా పాలు కొనసాగిస్తున్నాయి . రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి . మరియు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోగులకు అందుతున్న సేవలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు . అనంతరం ఆస్పత్రి వార్డులను ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించి రోగులతో మాట్లాడారు . రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు . అనంతరం వైద్య సిబ్బ ందికి పలు సూచనలు చేశారు . కలెక్టర్ కంటి పరీక్షలు చేయించుకున్నారు . వెంట కంటి వైద్యనిపుణులు డాక్టర్ సిద్ధార్థ , వైద్య సిబ్బంది ఉన్నారు .
One Comment