తెలంగాణలో కరోనా ఉదృతి, COVID19 Telangana cases
తెలంగాణ లో 35 వేలకు చేరువలో కేసులు , COVID19 Telangana cases తాజాగా 1563 మంది డిశ్చార్జి , ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులు 11,883, 90 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి అంటున్న వైద్య ఆరోగ్యశాఖ.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35 వేలకు దగ్గర చేరుకుంది . ఇప్పటి దాకా 1,70,824 మందికి క రోనా పరీక్షలు నిర్వహించగా 34,671 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది . 1,35,658 మందికి నెగిటివ్ నివేదికలు వచ్చాయి . గత 24 గంటల్లో 1269 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇందులో 800 మంది జీహెచ్ఎంసీ పరిధి లోనే ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది .
COVID19 Telangana cases :
జీహెచ్ఎంసీ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 132 పాజిటివ్ కేసులు కాగా , మేడ్చల్ జిల్లాలో 94 , సంగారెడ్డి జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి . కరీంనగర్ జిల్లాలో 23 , వరంగల్ అర్బన్లో 12 , మెదక్ లో 14 , మహబూబ్ నగర్ లో 17 , నల్గొండలో 15 , నాగర్ కర్నూల్ జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి . నిజామా బాద్ 11 , వనపర్తిలో 15 , సూర్యాపేట , గద్వాల జిల్లాల్లో 7 చొప్పున వ్యాధి నిర్ధారణ అయిన బులిటెన్లో పేర్కొంది . జగిత్యాల జిల్లాలో 4 , యాదాద్రి జిల్లాలో 1 , మహబూబాబాద్ జిల్లాలో 8 , పెద్దపల్లిలో 9 , మంచిర్యాల , కొత్తగూడెం , సిరిసిల్ల , సిద్దిపేట జిల్లాల్లో మూడేసి కేసులు నమోదయ్యాయి . ఆదిలాబాద్ జిల్లాలో 4 , వికారాబాద్ , జనగాం జిల్లాల్లో ఆరు చొప్పున కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు .
కరోనాతో తాజాగా 8 మంది మృతి చెందగా ఇప్పటిదాకా 356 మంది ఈ మహమ్మారితో చనిపోయారు . గత 24 గంటల్లో 1563 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటిదాకా కోలుకుని ఇంటికి వెళ్ళినవారు 22,482 మందని తెలిపింది . ఆసుపత్రుల్లో ఇంకా 11,888 మంది చికిత్స పొందుతున్నట్టు పేర్కొంది . ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17,081 కరోనా పడకలు ఉండగా ఇందులో 11,928 ఐసోలేషన్ పడకలని , 3,587 ఆక్సిజతో కూడిన పడకలని , 1616 ఐసీయూ పడకలని తెలిపింది . ఈ ఆసుపత్రుల్లో 90 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని స్పష్టంచేసింది . 11,928 ఐసోలేషన్ పడకల్లో 843 మంది మాత్రమే ఉన్నారని , 11,085 ఖాళీగా ఉన్నాయని తెలిపింది .