తెలంగాణలో కరోనా ఉగ్ర రూపం, COVID positive cases in TS

COVID positive cases in TS కొత్తగా 1831 కేసులు మరో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది . ప్రభుత్వ ఉద్యోగులను , వైద్యులను , పోలీసు లను , జర్నలిస్టులను , ప్రజాప్రతినిధులను కూడా వీడటం లేదు .

 సోమవారంనాడు 1831 మందికి కరోనా పాజిటీవ్ నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది . ఇందులో జిహెచ్ఎంసిలో పరిధిలో 1419 మంది . కరోనా పాజిటీవ్ వచ్చిన వారు ఉన్నారు . రంగారెడ్డిలో 160 , మేడ్చల్ లో 117 , సంగారెడ్డిలో 3 , కరీంనగర్ లో 5 , మహబూబ్ నగర్ లో 9 , గద్వాలలో 1 , నల్లగొండలో 9 , వరంగల్ అర్బన్లో 9 , నిజామాబాద్ లో 9 , వికారాబాద్ లో 7 , మెదక్ లో 20 , నారాయణ పేటలో 1 , పెద్దపల్లిలో 9 , యాదాద్రిలో 1 , సూర్యాపేటలో 6 , మంచిర్యాలలో 20 , ఖమ్మంలో 21 , జగిత్యాలలో 4 , మహబూబాబాయ్ 1 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యారు . కరోనా కారణంగా ఇదే రోజు 11 మంది మృతి చెందారు . ఈ ఒక్క రోజులో 2078 మంది డిశ్చార్జ్ అయ్యారు . రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,733 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . కోలుకున్నవారి సంఖ్య 14,781 కు చేరింది . కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 306 కి చేరింది . ఇంకా 10,646 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతు న్నారు .

COVID positive cases in TS ::

 పాజిటీవ్ కేసుల సంఖ్య ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి . ఇంకా కరోనా పరీక్షల ఫలితాలు కొన్ని రావాల్సి ఉంది . మంత్రి మహ్మద్ అలీ కరోనా బారిన వడి కోలుకున్నారు . ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి , ఆమె భర్తకు పాజిటీవ్ రావడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో కూడా కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతున్నాయి ప్రజలు మాన్కులు ధరించడం , సామాజిక దూరాన్ని పాటించే విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తోంది . రాత్రిపూట కర్ఫ్యూను రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా పాటిస్తున్నారు .

 రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు . ఈ ఎమ్మెల్యేలలో బాజిరెడ్డి గోవర్ధన్ , ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి ఉన్నారు . వీరు కోలుకున్నారు . ఇదే సమయంలో వారు తమ కార్యకర్తలకు , అభిమానులకు వీడియో సందేశాలు వంపిస్తూ తాము ఆరోగ్యంగా ఉన్నామని , మనో ధైర్యమే దీనికి సరైన మందని చెప్పారు . సచివాలయంతో సహా జిహెచ్ఎంసీలోనూ , ఇతర  ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి . వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతుంది . పలు చోట్ల మరణాలు కూడా జరిగాయి . కరోనా సోకిన వారిలో ముగ్గురు , నలుగురు అధికారులు కూడా ఉన్నారు . దాదాపుగా అందరూ కోలుకున్నారు .

 హైదరాబాద్ కరోనా విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయంతో సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వ హణకు సంబంధించి నూతన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది . 50 శాతం ఉద్యోగులు వారం విడిచి వారం , మరో 50 శాతం ఉద్యోగులు రోజు విడిచి రోజు విధులు నిర్వహించా లని సూచించింది . నగరంలోని వలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులకు కరోనా సోకింది . సీఐతో సహా కానిస్టేబుళ్లకు కరోనా పాజిటీవ్ గా తేలింది . బాధితుల్లో ఎక్కువ మంది వాహనాల తనిఖీ విధులు నిర్వహించినవారే ఉన్నారు . ముగ్గురు ఐపిఎస్ అధికారులు కరోనా బారిన పడినప్పటికీ కోలుకుని విధుల్లో చేరిపోయారు . ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,22,218 మందికి కరోనా పరీక్షలు జరిగాయి . అందులో 96 , 485 మందికి కరోనా నెగిటీవ్ వచ్చింది .

Related Articles

Back to top button