TS ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు, inter supplementary exams cancelled

 కరోనా తీవ్రత నేపథ్యంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ inter supplementary exams cancelled పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమారు బుధవారం మౌఖిక ఆదేశాలు జారీచేశారు .

 రెండు , మూడు రోజుల్లో ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో తప్పిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించేందుకు విధి విధానాలను రూపొందించాలని సోమేష్ కుమార్ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రను కోరగా ఆమే ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీలకు సందేశం పంపి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు . ఇప్పటికే పదవ తరగతి వార్షిక పరీక్షలను రద్దుచేసి విద్యార్థులందరినీ అంతర్గత మార్కుల ద్వారా ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే . అయితే ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సరంలో తప్పిన విద్యార్థులను ఎలా ఉత్తీర్ణు లుగా ప్రకటించాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని రెండు ప్రత్యామ్నాయాలను సూచించాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డు కార్యదర్శిని కోరింది .

inter supplementary exams cancelled

 మార్చిలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను జూన్ 18 న విద్యామంత్రి సబిత ప్రకటించారు . దాదాపు 3.30 లక్షల మంది ఫెయిలయ్యారు . ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం తో ప్రథమ , ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో తప్పి సపి మ్లెంటరీ పరీక్షల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించినట్లయింది . అయితే పరీక్షల్లో తప్పిన విద్యార్థులను ఎలా ఉత్తీర్ణులుగా ప్రకటించాలన్న అంశంపై ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం రాత్రి నుంచే కసరత్తు ప్రారంభించింది .

ఉత్తీర్ణులుగా ప్రకటించడానికి రెండు ప్రత్యామ్నాయాలను సిద్ధంచేసే పనిలో బోర్డు ఉన్నట్టు సమాచారం . వివిధ రాష్ట్రాలు అమలు చేసిన విధానాలను పరిగణలోకి తీసుకుని ఆయా ప్రభుత్వాలకు చెందిన అధికారులతో సంప్రదించి అక్కడి సమాచారాన్ని తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం . మొదటి ప్రత్యామ్నాయం విద్యార్థి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులతో తప్పాడో ముందు గుర్తించి ఉత్తీర్ణతకు ఎన్ని మార్కులు కావాలో అన్ని మార్కులు కలపడం మొదటి ప్రత్యామ్నాయమని అధికారులు చెబుతున్నారు . ఒక విద్యార్థి ఒక సబ్జెక్టు లో తప్పాడా , రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడా ఇలా ఎన్ని సబ్జెక్టుల్లో తప్పాడు , ఎన్ని మార్కులు సాధించా డు అనే గణాంకాలను తీయవలసి ఉంటుంది . తప్పిన సబ్జెక్టులకు మార్కులు కలిపి ఉత్తీర్ణులుగా ప్రకటించడం మొదటి ప్రత్యామ్నాయమని చెబుతున్నారు . 

రెండో ప్రత్యామ్నాయం ప్రకారం విద్యార్ధులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించడం . ఎన్ని సబ్జెక్టుల్లో తప్పాడు , ఎన్ని మార్కులు వచ్చాయన్న అంశాల  జోలికి వెళ్ళకుండా అందరినీ పాస్ చేయడమని చెబుతున్నారు . అయితే రెండు ప్రత్యామ్నాయాల్లో విద్యార్ధులకు ఇచ్చే మార్కుల జాబితాలో మాత్రం పాస్ అని ఇవ్వకుండా కంపార్టుమెంటల్ పాస్ టైప్ చేసి ఇవ్వనున్నట్టు సమాచారం .

Related Articles

Back to top button