రికార్డ్ స్థాయిలో నమోదైన కరోనా కేసులు, COVID cases in TS

COVID cases in TS ఒక్క రోజే 1892 కేసులు నమోదయ్యాయి. దీంతో  20 వేల మార్కును దాటిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది . శుక్రవారం రికార్డు స్థాయిలో 1892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేల మార్కును దాటి 20,462 కు చేరుకుంది .

 తెలంగాణాలో మొదటి కరోనా కేసు వెలుగు చూసిన మార్చి 2 నుంచి ఇప్పటి వరకు ఒక రోజులో నమోదుకానన్ని అత్యధిక కేసులు శుక్రవారం ఒక్కరోజే నమోదయ్యాయి . రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో శుక్రవారం ఒక్కరోజే 1892 పాజిటివ్ కేసులు , నమోదు కాగా ఒక్క హైదరాబాద్లోనే 1658 కేసులు నమోదయ్యాయి . శుక్రవారం 5,965 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏకంగా 1892 మందికి పాజిటివ్ తేలడం రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుందన్న విషయం స్పష్టమవుతోంది .

COVID cases in TS ::

 ఇప్పటి వరకు తెలంగాణాలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య కూడా శుక్రవారంతో లక్ష దాటింది . ఇప్పటి వరకు 1,04,118 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది . శుక్రవారం నాటికి కరోనాతో వివిధ  ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 9,984 గా నమోదైంది . కాగా శుక్రవారం 1126 మంది డిశ్చార్జ్ అయినట్లు ఇప్పటి వరకు 10 , 195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు . శుక్రవారం ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు . దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 288 కు చేరుకుంది .

 జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . శుక్రవారం ఒక్కరోజే 1658 పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి . జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో 56 , మేడ్చల్ లో 44 , సంగారెడ్డిలో 20 , కరీంనగర్ లో 1 , మహబూబ్ నగర్ లో 12 , గద్వాలలో 1 , సిరిసిల్లలో 6 , ఖమ్మంలో 2 , కామారెడ్డిలో 6 , నల్గొండలో 13 , సిద్దిపేటలో 3 , ములుగు 1 , వరంగల్ రూరల్ లో 41 , జగిత్యాలలో 1 , మహబూబాబాద్ లో ” , నిర్మల్ లో 2 , మెదక్ లో 3 , నిజామాబాద్ లో 3 , వరంగల్ అర్బన్లో 1 , భద్రాద్రి కొత్తగూడెంలో 4 , నాగర్ కర్నూల్ లో 1 , వికారాబాద్ లో 1 , వనపర్తిలో 5 కేసులు నమోదయ్యాయి .

Related Articles

Back to top button