తెలంగాణలో తగ్గని కరోనా ఉదృతి, COVID19 total cases in Telangana state
మంగళవారం కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు COVID19 total cases in Telangana state 88 కి చేరిన మృతుల సంఖ్య. 94 తాజా కేసులతో రాష్ట్రంలో 2792 కు చేరిన కరోనా వైరస్ కేసులు, ఇందులో అత్యధికంగా గ్రేటర్‌లో 79 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా మరో 6 గురిని బలితీసుకుంది . 94 కొత్త కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2792 కు చేరుకుంది . అంటే 3 వేలకు చేరువగా కేసులు దూసుకెళ్తున్నాయి . ప్రభుత్వం అంచనాల మేరకు ఆంక్షల సడలింపుతో కేసుల నమోదులో వృద్ధికనిపిస్తోంది . ఈ మేరకు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది .
COVID19 total cases in Telangana state ::
ఈ బులిటెన్న ప్రకారం మొదటి నుంచి కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న గ్రేటర్ హైదరాబాద్ లో అదే ఉదృతి కనిపిస్తోంది . తాజాగా నమోదైన కేసుల్లో 79 ఇక్కడి నుంచే నమోదయ్యాయి . రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల్లో 3 చొప్పున , మెదక్ , నల్గొండ , సంగారెడ్డి జిల్లాల్లో ? చొప్పున , మహబూబాబాద్ , పెద్దపల్లి , జనగాం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి . సోమవారం వలసవాసుల్లో నుంచికేసులు నమోదుకాలేదు .
కరోనా మృతుల్లో ఒకరు టప్పాచబుత్రకు చెందిన 70 ఏళ్ళ వ్యక్తి . ఇతడు రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు . మరొకరు యాకుత్ పురాకు చెందిన 58 ఏళ్ళ వ్యక్తి . ఇతడు హైపర్ థైరాయిడ్ కార్డియాక్ డిసీతో 12 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు . మూడో మృతురాలు సనత్ నగర్కు చెందిన 39 ఏళ్ళ మహిళ ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు . నాలుగో మృతుడు ఓల్డ్ మలక్ పేటకు చెందిన 59 ఏళ్ళ వ్యక్తి . ఒకరోజు క్రితమే ఆసుపత్రిలో చేరారు . ఐదోమృతురాలు ఫలక్ నుమాకు చెందిన మూడున్నర నెలల వయసు బాలిక రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది . ఈమెను సిండ్రోమిక్ బేబిగా వైద్యులు గుర్తించారు . ఆరో మృతుడు చార్మినార్‌కు చెందిన వ్యక్తి . కరోనా బారినపడి ఒకరోజు క్రితం ఆసుపత్రిలో చేరాడు . ఇప్పటి వరకు 1,491 మంది డిశ్చార్జ్ కాగా , 88 మంది మృతి చెందారు . 1213 మంది చికిత్స పొందుతున్నారు .