బెల్లంపల్లి మండలం లో దారుణ హత్య, murder in bellampalli

murder in bellampalli మండలం మాలగురిజల గ్రామంలోని రంగంపేట గ్రామంలో సల్లూరి దుర్గయ్యను ఇంటి ప్రక్కనే గల దాగామ సురేందర్ అతి కిరాతకంగా కిరాతకంగా  బండతో బాది హతమార్చాడు .

 వివరాల ప్రకారం దాగామ సురేందర్ తన ఇంటి గోడను ప్లాస్టింగ్ చేసుకునేందుకు ఇతని ఇంటి వద్ద కట్టడంతో ఇక్కడ కట్టవద్దని , ఇది నా భూమిలో ఎలాంటివి చేయరాదని చెప్పడంతో దాగామ సురేందర్ , అతని భార్య కవితలు దుర్గయ్యపై దాడి చేయడంతో అతను కింద పడ్డాడు, అతనిపై పెద్ద బండరాయితో బాదడంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు .

 murder in bellampalli విషయం తెలుసుకున్న తాళ్ళగురిజాల పోలీసులు , ఏసీపీ రహెమాన్లు అక్కడికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఏసీపీ వివరాలను తెలుసుకున్నారు . అనంతరం రూరల్ సీఐ జగదీష్ మాట్లాడుతూ దుర్గయ్య, అతని భార్య పావని పై దాగామ సురేందర్ , అతని భార్య కవితలు తన భర్తను అతి కిరాతంగా దాడి చేసి చంపేశారని ఫిర్యాదు చేయడం జరిగిందని , ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు . మృతునికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు . మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోధనలు  పలువురిని కలిచివేశాయి . ఆయన వెంట తాళ్ళగురిజాల ఎస్సై సమ్మయ్య , టూటౌన్ ఎసై భాస్కర్ రావులు ఉన్నారు .

Related Articles

Back to top button