తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది, Coronavirus cases Telangana
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. Coronavirus cases Telangana 2098 బుదవారం ఒక్క రోజే 107 కేసులు నమోదయ్యాయి. మే నెలలో ఒక్క రోజు 107 పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి . అదేవిధంగా .. ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 100 కు పైగా ఉండడం కూడా ఇదే మొదటిసారి .
బుధవారం నమోదైన 107 పాజిటివ్ కేసులుకలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2098 కు చేరుకుంది . ఈ మేరకు రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది . ఇతర దేశాలకు , ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లి తిరిగి వస్తున్నవారి కారణంగానే తెలంగాణలో కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది . వైద్య , ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి .
Coronavirus cases Telangana ::
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ లోని జిల్లాలు , జీహెచ్ఎంసీతో కలుపుకుని 39 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి . బుధవారం ఒక్కరోజే ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లి తిరిగి వచ్చినవారిలో 19 మందికి , సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిలో 49 మందికి మొత్తం 68 మందికి కరోనా మహమ్మారి సోకింది . ఇప్పటివరకు ఇతర రాష్ట్రా లనుంచి స్వస్థలాలకు వచ్చిన 178 మంది వలస కూలీలకు , సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 94 మందికి , ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో 30 మందికి మొత్తం 297 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది .
రాష్ట్రంలో కోవిడ్ -19 మృత్యుఘోషక కొనసాగుతోంది . తాజాగా బుధవారం ఆరుగురు కరోనా బారిన పడి మృతిచెందారు . మంగళవారం వరకు 57 గా ఉన్న కరోనా మృతుల సంఖ్య బుధవారానికి 63 కు చేరుకుంది . కరోనా బారిన పడి రాష్ట్రంలో ఒకే రోజు ఆరుగురు మృతిచెందడం కూడా ఇదే తొలిసారి . ఇప్పటి వరకు 1821 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారంనాటి ప్రకటనలో తెలిపింది . ఇంకా 714 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది .
One Comment