మరో 3కొత్త కేసులు, లాక్ డౌన్ పొడిగించే అవకాశం, COVID19 cases in HYD

 కరోనా మహమ్మారి రాష్ట్ర రాజధాని హైదరాబాదు వదలడం లేదు COVID19 cases in HYD వరుసగా పాజిటివ్ కేసులు నమోదవుతూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్లో సోమవారం మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . జగిత్యాల జిల్లాలో కొత్తగా కరోనా మహమ్మారి ఒకరిని కబళించింది . ఇప్పటిదాకా 1085 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ మహమ్మారి బారిన పడి 29 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది .

 సోమవారం మరో 40 మంది డిశ్చార్జీ కావటంతో వైరస్ తో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు 471 మందికి తగ్గారు . వనసలిపురంలోని నాలుగు ప్రాంతాల్లో ఎనిమిది కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది . వ్యాధి తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంపై అధికారులను నివ్వెరపరుస్తోంది .

 17 జిల్లాల్లో కొత్తగా కేసుల్లేవు . . . .

 వరంగల్ రూరల్ , యాదాద్రి – భువనగిరి , వనపర్తి జిల్లాల్లో ఇంత వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు . రాష్ట్రంలోని 17 జిల్లాల్లో కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యశాఖ పేర్కొంది . వీటిలో కరీంనగర్ , – సిరిసిల్ల , కామారెడ్డి , మహబూబ్నగర్ , మెదక్ , భూపాలపల్లి , సంగారెడ్డి , నాగర్ కర్నూలు , ములుగు , పెద్దపల్లి , సిద్దిపేట , మహబూబాబాద్ , మంచిర్యాల , భద్రాద్రి కొత్తగూడెం , వికారాబాద్ , నల్గొండ , నారాయణపేట జిల్లాలు ఉన్నాయి . రాష్ట్రం మొత్తంలో COVID19 cases in HYD ఎక్కువగా ఉన్నాయి.

 వరంగ్ అర్బన్లో మరో కేసు . .

 వరంగల్ అర్బన్లో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు సమాచారం . ఇప్పటి వరకు ఈ జిల్లాలో 27 కేసులు నమోదు కాగా తాజా కేసుతో ఆ సంఖ్య 28కి చేరినట్లు తెలుస్తోంది . గత నెల 21న పూరిగుట్ట ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల బాలికలో కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది . ఆ బాలికను చికిత్సకోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు .

 పాజిటివ్ కేసుల మధ్యే రోజుల తరబడి కంటికి కనిపించని శత్రువు కరోనాతో పోరాడే క్రమంలో వైద్యులు , వైద్య సిబ్బంది అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు . పొరుగున ఉన్న వారికి కరోనా పాజిటివ్ అని తేలితే చాలు ఆ వీధి , ఆ ఊరు అంతా క్వారంటైన్లోకి వెళ్లిపోతుంది . తమ ప్రాంతాల్లోకి ఇతరులను రాకుండా అడ్డుకుంటుంది . కాని నిత్యం కరోనా పాజిటివ్ వ్యక్తుల మధ్యనే ఉంటూ గంటగంటకూ చికిత్స అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వారి ప్రాణాలను నిలుపుతున్నారు .

 రోజుల చిన్నారి మొదలు పండు ముదుసలి వరకు కరోనా బారిన పడుతుండడంతో చికిత్స చేయడం వైద్యులకు సవాల్ గా మారింది . కరోనా వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులను , వైద్యసిబ్బందిని అందరూ దూరం పెడుతున్నారు . అద్దెకు ఉండే వైద్యులు , సిబ్బంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది . ఇళ్లు ఖాళీ చేయమని ఇంటి యజమా నులు ఒత్తిడి తెస్తున్నారు . ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా ఇప్పటికీ వేధింపులు తప్పడం లేదు .

Related Articles

Back to top button