AP లో కొనసాగుతున్న కరోనా ఉదృతి. COVID19 cases in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగని కరోనా, COVID19 cases in Andhra Pradesh ఒక్క రోజులో 60 పాజిటివ్ కేసులు నమోదు, 24 గంటల్లో ఇద్దరు మృతి రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది . ఈ నెల ప్రారంభమైన నాటి నుంచి ప్రతి రోజూ 60కి తగ్గకుండా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది .

 బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో 60 పాజిటివ్ కేసులునమోదయినట్లుగా పేర్కొనడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది . 60 పాజిటివ్ కేసుల్లో 12 గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు కాగా  ఒకరు కర్నాటక రాష్ట్రానికి చెందినవారని ఆరోగ్య శాఖ తెలిపింది . బుధవారం నమోదైన కేసులతో కలిపి COVID19 cases in Andhra Pradesh ఇప్పటి వరకు మొత్తం 1777 పాజిటివ్ కేసులయ్యాయి . వీరిలో ఇప్పటి వరకు 729 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు .

 మంగళవారం ఉదయం నుంచి బుధవారం బులిటెన్ విడుదలయ్యే సమయం వరకు ఇద్దరు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు . వీరిలో ఒకరు కృష్ణా జిల్లా , మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన వారు . దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 36కు చేరింది . కరోనా విజృంభణలోనూ ఊరట కలిగించే విషయమేమిటంటే 24 గంటల్లో ఆయాజిల్లాలకు చెందిన 140 మంది చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జికావడమే .

 బుధవారం విడుదలైన బులిటెన్ ప్రకారం కర్నూలు జిల్లాలో అత్యధికంగా 17 కేసులువెలుగు చూడగా మొత్తం సంఖ్య 588కి చేరింది . ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్యలోనూ కర్నూలేపై స్థానంలో నిలుస్తోంది .

COVID19 cases in Andhra Pradesh ::

జిల్లాల వారీగా కేసుల వివరాలు ::

 కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది , కృష్ణా జిల్లాలో 10 , గుంటూరులో 8 , అనంతపురములో 4 , నెల్లూరులో 3 మరణాలు నమోదయ్యాయి . కొత్త కేసులు చూస్తే . . కృష్ణా జిల్లాలో 14 , గుంటూరులో 12 , విశాఖపట్నం లో 2 , తూర్పు గోదావరి , కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసులు నమోదయ్యాయి . గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7 వేల 782 శాంపిల్స్ పరీక్షించారు . డిశ్చార్జి అయిన వారు కాకుండా  ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1012గా ఉంది . 

Related Articles

Back to top button