దెబ్బకు దెబ్బ కొట్టిన ఆర్మీ, Encounter in Kashmir

Encounter in Kashmir ఎన్‌కౌంటర్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్తో సహా నలుగురు ఉగ్రవాదులు కాల్చివేత  స్వగ్రామంలోనే హతమైన రియాజ్ నైకో శ్రీనగర్.

 నిషేధిత హిజ్బుల్ ముజాహిదీస్ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకోతో సహా నలుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యారు . బుధవారంనాడు జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఆ నలుగురు ఉగ్రమాదులు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు .

 పుల్వామా జిల్లా బేగ్ పొర గ్రామంలో జేఎం కమాండర్ రియాజ్ నైకో , మరో మిలిటెంట్ హతమయ్యాడు . 8 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకోపై రూ . 12 లక్షల రివార్డు కూడా ఉంది . ” స్వగ్రామంలోనే భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యాడు . మరొకరిని ఇంకా గుర్తించాల్సి ఉంది .

 షర్దాలి గ్రామంలో జరిగిన మరొక ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు . దీంతో జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం కాశ్మీర్ లోయలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపేశారు . 2016 జులైలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బుర్హన్ వనీ భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన తర్వాత రియాజ్ నైకో డీ – ఫాక్టో చీగా కొనసాగుతున్నారు . దక్షిణ కాశ్మీర్ షోపియాన్లో మూడుసార్లు భద్రతా బలగాల ఉచ్చు నుంచి తప్పించుకున్నాడు . స్వగ్రామం బేగ్ పొరకు వస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు , భద్రతా బలగాలు Encounter in Kashmir సంయుక్తంగా నిఘా వేసి , మట్టుబెట్టినట్లు సైనిక అధికార ప్రతినిధి తెలిపారు .

 ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనపు బలగాలతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు . 

Related Articles

Back to top button