APలో ఎంపీ ఇంట్లొ ఆరుగురికి కరోనా, AP coronavirus tally 1097
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది . ఏమాత్రం అదుపు లేకుండా కరోనా వైరస్ రాష్ట్ర ప్రజానీకంపై దాడి చేస్తోంది . AP coronavirus tally 1097 రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81 కేసులు నిర్ధారణ అయ్యాయి . దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,097కు చేరుకుంది .
కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే ప్రధానంగా 52 కేసులు నమోదయ్యాయి . ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా ఉంది . ఇంకా విజయవాడలో చేయి దాటిపోయే పరిస్థితులు ఉన్నట్లు ప్రస్తుత ఆందోళనకర స్థితి బట్టి తెలుస్తోంది .
ఇక కృష్ణా తర్వాత అనంతపురంలో 2 , పశ్చిమగోదావరిలో 12 , ప్రకాశంలో 3 , కర్నూ లులో 4 , కడపలో 3 , గుంటూరులో 3 , తూర్పుగోదావరిలో 2 కేసుల చొప్పున నమో దయ్యాయి . కాగా గడిచిన 24 గంటల్లో 6,768 నమూనాలను పరీక్షించారు . వీటిలో 81 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది . మరోవైపు గత 24 గంటల్లో 60 మంది కోవిడ్ బాధితులు కోలుకుని , హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు . దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 231కు చేరుకుంది . మరో 31 మంది ఇప్పటి వరకు మరణించారు . AP coronavirus tally 1097 .
కర్నూలు ఎంపీ ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ !
కర్నూలు జిల్లాను కరోనా వైరస్ కమ్మేస్తోంది . కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది . ఎంపీ స్వయంగా వైద్యులు కాగా , ఆయన కుటుంబసభ్యుల్లో అందరూ వైద్యులే , సంజీవ్ కుమార్ ఇద్దరు సోదరులు , వారి భార్యలకు వైరస్ సోకింది . వీరందరూ వైద్యులే . వీరిలో ఒకరి కుమారుడికి కూడా పాజిటివ్ గా తేలింది . అలా గే 80 ఏళ్ల వృదుడైన ఎంపీ తండ్రికి కరోనా వైరస్ సోకడంతో అయనను హైదరాబాద్లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి అక్కడి చికిత్స చేయిస్తున్నారు .
వీరికి వైరస్ ఎలా సోకిందన్నది ప్రస్తుతం అంతుబట్టని ప్రశ్నగా మారింది . ఢిల్లీ మర్క జ్ కు వెళ్లి వచ్చిన యాత్రికులు , తర్వాత అనారోగ్యానికి గురవ్వడంతో .కరోనా వైరస్ అని తెలియక చాలామంది ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయిం చుకున్నారు . అలా వెళ్లిన వారి ద్వారా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు .
అంతేగాకుండా ఎంపీ కుటుంబంలో అందరూ వైద్యులు కావడంతో గత నెలరో జులుగా వీరు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు . ఈ క్రమంలో వీరికి కరోనా సోకిందన్న అభిప్రాయాలున్నాయి ఆయన వైద్యాలయాన్ని సీజ్ చేసి అందులో పనిచేస్తున్న సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయించగా , అందులో 11 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది .