కొన్ని జన్ దన్ ఖాతాల్లో డబ్బు వెనక్కి, Bank withdrawal money

తెలంగాణా రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల జనధన్ ఖాతాలకు పిఎంజికైవై కింద జమచేసిన రూ . 16 కోట్లకు పైగా నగదును Bank withdrawal money తెలంగాణ గ్రామీణ బ్యాంకు ( టిజిబి ) వెనక్కి తీసుకుంది .

 దేశంలో కరోనా వ్యాప్తి , లాక్ డౌన్ నేపథ్యంలో జనన్ ఖాతాల్లో నెలకు రూ . 500 చొప్పున మూడు నెలల పాటు జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది . ఆ మేరకు ఆయా ఖాతాల్లో ఈ నెల మొదటివారంలో దేశవ్యాప్తంగా నగదు జమ చేసింది . ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9 లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్ నెలకు చెందిన రూ . 500 చొప్పున జమ అయ్యాయి . అయితే వీరిలో 5 , 15 , 260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా బ్యాంకు తేల్చింది .

 ఇప్పటికే అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు రూ . 16 కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు Bank withdrawal money తెలంగాణ గ్రామీణ బ్యాంకు జిఎం మహేష్ తెలిపారు . 2014 ఆగస్టు ఒకటో తేదీ తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు ఆయన స్పష్టం చేశారు . తమ వద్ద జరిగిన పొరపాటు వలనే నగదు అనర్హులకు జమ చేశామని , వారం రోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని ఆయన వెల్లడించారు .

Related Articles

Back to top button