రాష్ట్రంలో కరోనా విజృంభణ, TS coronavirus cases
TS coronavirus cases కరోనా పాజిటివ్ కేసులు 40 వేలకు చేరువయ్యాయి . రాష్ట్రంలో కొత్తగా 1597 మందికి క రోనా మహమ్మారి సోకింది . సోమవారం 13,642 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12,045 మందికి నెగిటివ్ , 1597 మందికి పాజిటివ్ గా తేలినట్లు హెల్త్ బులెటిన్లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది .
తాజా కేసులను కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసులు 39,342 కు చేరింది . ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,08,666 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 39,342 మందికి పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి . కరోనా నుంచి కోలుకుని 1159 మంది డిశ్చార్జ్ కాగా , ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 25,999 గా నమోదైంది . కరోనా సోకి వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 12,958 మంది చికిత్స పొందుతున్నారు . కరోనా మహమ్మారితో మరో 11 మంది చనిపోగా , ఇప్పటి వరకు మొత్తం చనిపోయిన వారిసంఖ్య 386 కు చేరింది . ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో పెద్దమొత్తంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . తాజాగా బుధవారం 796 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి .
TS coronavirus cases ::
జిల్లాల్లోనూ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది . బుధవారం నమోదైన 1597 పాజిటివ్ కేసుల్లో అగ్రభాగం గ్రామీణ జిల్లాలదే . కొత్తగా నమోదైన 1597 కేసుల్లో ఏకంగా 801 కేసులు జిల్లాల్లోనే నమోదు కావడం కరోనా వైరస్ మోగిస్తున్న ప్రమాద ఘంటికలను సూచిస్తోంది . ఏ రోజుకారోజు గ్రామీణ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి . జిల్లాల వారీగా పాజిటివ్ కేసులను చూస్తే రంగారెడ్డి 212 , మేడ్చల్ 115 , సంగారెడ్డి 73 , ఖమ్మం 6 , కామారెడ్డి 30 , వరంగల్ అర్బన్ 44 , కరీంనగర్ 41 , యాదాద్రి భువనగిరి 18 , మహబూబాబాద్ 5 , పెద్దప ల్లి 20 , మెదక్ 18 , మహబూబ్ నగర్ 21 , మంచిర్యాల 26 , భద్రాద్రి కొత్తగూడెం 7 , జయశంకర్ భూపాపల్లి 15 , నల్గొండ 58 , సిరిసిల్ల 6 , ఆదిలాబాద్ 1 , నారాయణపేట , వికారాబాద్ , నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఐదేసి కేసుల చొప్పున , జనగామలో 8 ,నిజామాబాద్లో 13 , ములుగులో 4 , వనపర్తిలో 5 , సిద్దిపేటలో 25 , సూర్యాపేట 14 , గద్వాలలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి .