కరోనా బాధితుల కోసం వాట్సప్ హెల్ప్ లైన్, Helpline for corona patients

  Helpline for corona patients ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరిన కోవిడ్ -19 బాధితుల నుంచి ఫీజుల పేరుతో లక్షల్లో బిల్లులు వేయడాన్ని నియంత్రించేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది . ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సప్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది .

 అధిక బిల్లులతో పాటు పడకలు లేవని , ఇతర ఔషధాలను బ్లాకులో తెప్పిస్తున్నామని రోగులను ఇబ్బంది పెడితే 9154170960 నెంబరు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు . ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు . 20 మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్సలు రాష్ట్ర వ్యాప్తంగా 20 మెడికల్ కాలేజీల్లో ఉచిత కరోనా వైద్యాన్ని అందించాలని నిర్ణయించిందని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు .

Helpline for corona patients ::

 రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17081 కోవిడ్ బెడ్లు ఉన్నాయని ఇందులో 89 శాతం దాకా ఖాళీగా ఉన్నాయన్నారు . కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు ప్రయివేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చామన్నారు . కొద్దిరోజులుగా ప్రయివేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు . రాబోయే రోజుల్లో ప్రయివేటు ఆసుపత్రుల్లో చేస్తున్న వైద్యచికిత్సలపై గట్టి నిఘా పెడతామన్నారు . ప్రస్తుతం మల్లారెడ్డి , కామినేని , మమత మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు .

 కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర మందులను తగినంత నిల్వ ఉండేలా ఉత్పత్తి చేయాలని ఫార్మా కంపెనీలు , ఫార్మా డీలర్లు , రిటైలర్లు , హోల్ సేల్ వ్యాపారులను తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ ఆదేశించింది . ఈ మేరకు సంస్థ డైరెక్టర్ ప్రీతిమీనా బుధవారం ఆదేశాలు జారీచేశారు . యాంటీబయోటిక్స్ తో పాటు సిట్రజిన్ , ప్యారసిటమాల్ తదితర ఎనిమిది ఔషధాలను అత్యవసర ఔషధాల జాబితాలో పేర్కొన్నారు .

Related Articles

Back to top button