తెలంగాణ పై కరోనా వైరస్ పంజా, Telangana COVID cases
తెలంగాణ పై కరోనా వైరస్ పంజా.. Telangana COVID cases 24 గంటల్లో 1879 జీహెచ్ఎంసీలోనే 1422 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో ఏడుగురు కరోనాతో కన్నుమూత మొత్తం కేసులు 27,612.
రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తూనే ఉంది . మంగళవారం 1,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా , 1,422 జీహెచ్ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయి . 176 పాజిటివ్ కేసులతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉండగా , 94 కేసులతో మేడ్చల్ జిల్లా మూడోస్థానంలో ఉంది . కరోనాతో తాజాగా ఏడుగురు చనిపోగా , మొత్తం మృతుల సంఖ్య 313 కు చేరింది . గత 24 గంటల్లో 6,220 మందికి పరీక్షలు నిర్వహించగా 1879 మందికి పాజిటివ్ రాగా , 4,341 మందికి నెగిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది .
Telangana COVID cases ::
మంగళవారం ఒక్కరోజే 1506 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి దాక డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,287 కు చేరింది . ఇంకా ఆసుపత్రుల్లో 11,012 మంది చికిత్స పొందుతున్నారు . గాంధీ ఆసుపత్రి పడకల సామర్థ్యం 1890 కాగా 180 మంది వ్యాధిగ్రస్తులు ఐసీయూలో ఉన్నారని , 356 మంది ఆక్సిజన్‌తో చికిత్స పొందుతు న్నారని , 35 మంది సీపీఏపీలో ఉన్నారని తెలిపింది . ఈ ఆసుపత్రిలో 219 వార్డుల్లో 742 వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఇంకా 1150 పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది .
రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో 92.2 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని 7.8 శాతం పడకలు మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులతో నిండిపోయాయని తెలిపింది . 11,928 ఐసోలేషనడకలు అందుబాటులో ఉండగా 660 పడకలు వినియోగించామని 11,268 పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది . ఆక్సిజన్ ఆధారితపడకలు 3,587 ఉండగా , 496 వినియోగిస్తున్నామని పేర్కొంది . 1616 ఐసీయూ పడకలు ఉండగా 179 వినియోగిస్తున్నామని తెలిపింది . ఐసోలేషన్ , ఆక్సిజన్ , ఐసీయూ పడకలు 17,081 అందుబాటులో ఉండగా 1835 పడకలపై వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతు న్నారని , 15,746 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు .