Trending

UP పోలీసుల సంచలన ఎన్ కౌంటర్, vikas dubey encounter

 యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను గురువారం పోలీసులు అరెస్టు చేశారు vikas dubey encounter కాన్పూర్ లో ఎనిమిది మంది పోలీసులను కాల్చి వేసిన ఘటనలో ఇతను ప్రధాన నిందితుడు . వారం రోజులుగా పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన దూబే , గురువారం మధ్య ప్రదేశ్ ఉజ్జయినిలోని మహంకాళి ఆలయంలో పోలీసులకు చిక్కాడు .

 మరోవైపు యూపీలో అతని ఇద్దరు ప్రధాన అనచురులు ఎన్ కౌంటర్ లో మరణించారు . అరెస్టు చేస్తున్న సమయంలో నేనే వికాస్ దూబే .. కాన్పూర్ వాలా అంటూ బిగ్గరగా అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు . దూబే చారల తెల్ల టీషర్ట్ ధరించివున్నాడు . అతని మీద 60 క్రిమినల్ కేసులు ఉన్నాయి . రూ.ఐదు లక్షల రివార్డు కూడా యూపీ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే . కాగా , రోడ్డు మార్గాన లక్నోకి తీసుకువచ్చారు . దూబే భార్య , కొడుకును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .

 

దూబే ఉదయాన్నే మహంకాళి ఆలయంలోకి దర్శనానికి వెళ్లాడు . ఆ సమయంలో అక్కడున్న భద్రత సిబ్బంది అతడిని గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు . సొంత పేరుమీద వీఐపీ దర్శనం టోకెన్ తీసుకున్నాడు . అయితే , అమ్మవారికి డొనేషన్ ఇస్తున్న కౌంటర్ వద్ద తన పేరు చెప్పడానికి నిరాకరించాడు . దాంతో అనుమానించిన అక్కడి సిబ్బంది పోలీసులకు విషయం చేరవేశారు . కొద్దిసేపటికే అక్కడు చేరుకున్న పోలీసులు కిరాత కగ్యాంగ్ స్టర్లను అరెస్టు చేశారు .

vikas dubey encounter ::

 గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ లో హతమయ్యారు . మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ప్రత్యేక వాహనంలో కాన్పూరకు తరలిస్తుండగా .. పోలీసుల ఎస్కార్ట్ లోని ఆ వాహానం బోల్తా పడింది . దీనిని అదునుగా తీసుకున్న వికాన్ పారిపోయేందుకు ప్రయత్నించాడు . ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా .. అతడు మరణించినట్లు తెలుస్తోంది .

 వికాస్ ను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం . ఈ యు పి లో నేర సామ్రాజ్యం నిర్మించుకున్న విజాస్ దూబేను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడి అనుచరులు .. పోలీసులపై కాల్పులకు  తెగబడిన విషయం తెలిసిందే .

Related Articles

Back to top button