తెలంగాణలో ఆగనీ కరోనా, Coronavirus cases in Telangana state
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి ప్రజలను దడ పుట్టిస్తోంది. Coronavirus cases in Telangana state 1551, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరసను నియంత్రిం చలేకపోతున్నామన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది . ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 42 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 37 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం బట్టి చూస్తుంటే వైరస్ తీవ్రత ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోందని అధికారులు అంటున్నారు .
Coronavirus cases in Telangana state ::
తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇరువురు ఈ మహమ్మా రిబారిన పడ్డారు . ముగ్గురు వలస కూలీలకు వైరస్ సోకడంతో వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు . ఆదివారం నాటి 42 కేసులు కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటిదాకా పాజిటివ్ కేసుల సంఖ్య 1551 కు చేరింది . 992 మంది డిశ్చార్జి కాగా 525 మంది ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు . ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసకూలీల్లో ఇప్పటిదాకా 57 మందికి మహమ్మారిసోకింది .
ఆదివారం 21 మంది వ్యాధి గ్రస్థులను డిశ్చార్జి చేయగా ఇప్పటిదాకా ఈ మహమ్మారితో 34 మంది మృత్యు వాత పడ్డారు . వరంగల్ రూరల్ , యాదాద్రి , వనపర్తి జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కేసుకూడా నమోదు కాలేదు . రాష్ట్రంలోని 25 జిల్లాల్లో గత రెండువారాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదని వైద్య రోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది . కాగా మాదన్నపేట ప్రాంతంలో ఒక బర్త్ డే పార్టీకి వెళ్లి 28 మందికి వైరస్ సోకిన విషయం తెలిసిందే . మరో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ సంఖ్య 31 కి చేరింది . కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అంత కంతకూ విజృంభిస్తోంది . తాజాగా నమోదైన 42 పాజిటివ్ కేసులతో అధికార యంత్రంగా మరింత అప్రమత్తం కావాలని నిర్ణయించింది .