పది పరీక్షల తేదీలు ఖరారు, 10th exam dates announced
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి, ఇపుడు 10th exam dates announced చేశారు. వైరస్ వ్యాప్తి నీ అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి, లాక్ డౌన్ వల్ల పదో తరగతి పరీక్షలు వాయిదా వేశారు. కరోనా కేసులు వ్యాప్తి తగ్గుతున్న నేపథ్యంలో కొత్త పది పరీక్షల తేదీలు ఖరారు చేసారు.
జులై 1 నుంచి సీబీఎస్ఈ 10 , 12 తరగతి పరీక్షలు ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి పోఖియాల్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న సీబీఎస్ఈ 10 , 12 వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ తెలిపింది . ఈ మేరకు మంత్రి రమేష్ పొట్రియాల్ ఈ తేదీలను శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు .
10th exam dates announced ::
10 , 12వ తరగతులకు సంబంధించి కొన్ని పరీక్షలను లాక్ డౌన్ కన్నా ముందే సీబీఎస్ఈ నిర్వహించింది . కరోనా వ్యాప్తి కారణంగా మిగిలిన పరీక్షలు వాయిదా పడ్డాయి . ఈ పరీక్షలు జులైలో జరుపుతామని మంత్రి పొథ్రియాల్ తాజాగా వెల్లడించారు . పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు .
అయితే పలితాలను ఎప్పుడు ప్రకటిస్తారన్న అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు . కరోనా ప్రభావంతో లా క్ డౌన్ విధించ డంతో 29 సబ్జెక్టుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మార్చి 25 న అధికారులు ప్రకటించారు . ఐఐటీ , ఎఐటీ సంస్థల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష తేదీని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖియాల్ ప్రకటించారు . ఆగస్టు 28వ తేదీన ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు .