తెలంగాణలో కొత్తగా 7కరోనా కేసులు, CoVID19 cases tally in Telangana
తెలంగాణ రాష్ట్రం లో మహమ్మారి కరోనా మహమ్మారి సోకి గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన 28 రోజుల పసికూన బుధవారం డిశ్చార్లయ్యాడు. CoVID19 cases tally in Telangana 1016 నారాయణపేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన పసిబాలుడికి వైరస్ సోకడంతో అక్కడి వైద్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు . పూర్తిగా కోలుకోవడంతో బాలుడిని ఇంటికి పంపించినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ చెప్పారు .
బుధవారం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన వారిలో 13మంది చిన్నారులు ఉండటం విశేషం . బుధవారం గాంధీ ఆసుపత్రి నుంచి 35 మందిని డిశ్చార్జి చేయగా ఇందులో 18మంది చిన్న పిల్లలున్నారని వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ చెప్పారు . కరోనా వ్యాధి నయమై ఇంటికి వెళుతున్న బాధితులు వైద్యులను , సిబ్బందిని కలిసి ధన్యవాదాలు చెప్పారు .
బుదవారం రాష్ట్రంలో కరోనా సోకి ఏడుగురికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని , వీరంతా జీహెచఎంసీ పరిధిలోని వారేనని వైద్య , ఆరోగ్యశాఖ తెలిపింది . గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నవారిలో పదిమంది ఐసీయూలో ఉన్నారని , వీరిలో ఒకరు వెంటిలేటర్ మీద ఉండగా , ఇద్దరికి డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి .
ఇద్దరూ క్యాన్సర్తో బాధపడుతున్నారని , మరొకరు పాంక్రియాజ్ సమస్యలతో , నలుగురు గుండె సంబంధిత వ్యాధితో ఉన్నారని పేర్కొన్నారు . ఒకరు మాత్రం వెంటిలేటరు మీద ఉండగా మిగిలినవారిలో నలుగురికి ఆక్సిజన్ సపోర్టు అందిస్తున్నామని , నిరంతర పర్యవేక్షణలో అందరూ కోలుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు .
దేశంలో కరోనా వైరస్ సోకి మరణిస్తున్న వారి సంఖ్యతో పోలిస్తే తెలంగాణలో 2.5శాతంగా ఉందని , జాతీయ స్థాయిలో 3 . 2శాతంగా నమోదయిందని , ఇది మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు . ఇప్పటి వరకు 406 మంది డిశ్చార్జి కాగా 585మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు CoVID19 cases tally in Telangana కరోనాతో ఇప్పటి దాకా 25 మంది మరణించారని , కొత్తగా ఏడు కేసులు కలుపుకుని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరిందని తెలిపారు .