Trending

టాప్ టెన్ లోకి చేరిన భారత్, ఆందోళనలో వైద్యులు, India COVID19 cases

 కరోనా భారత్ ను వణికిస్తోంది. India COVID19 cases 1,90,535 మెల్లిగా విస్తరించిన మహమ్మారి ప్రస్తుతం తన వేగాన్ని పెంచింది . ఫలితంగా భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది . కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్ర స్థానంలో చేరింది . ప్రపంచంలో టాప్ టెన్ దేశాల సరసన చేరింది . మొత్తం మీద ఏడో స్థానంలో నిలిచింది .

 కేంద్ర వైద్య , ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం , గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 8392 మందికి కొత్తగా కరోనా సోకింది . 230 మంది మరణించారు . దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 1,90,535 కి చేరింది . అంటే రెండు లక్షలకు చేరువుతోంది . మృతుల సంఖ్య 5,394 కి చేరుకుంది . 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది . దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 91,819 మంది కోలుకున్నారు ..

India COVID19 cases ::

 ప్రపంచవ్యాప్తంగా 62 లక్షలు దాటిన కరోనా కేసులు. ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేస్తోంది . దీనితో ప్రపంచ దేశాలు వైరస్ తో విలవిల్లాడుతున్నాయి . ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది . ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 62 లక్షలు దాటాయి . బ్రెజిల్ లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది . రష్యాలో కరోనా విజృంభిస్తోంది . ఇక ప్రపంచవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మొత్తం 62,66,875 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,73 , 960 మంది మృతి చెందగా కరోనా బారినపడి 28,47,525 మంది కోలుకున్నారు .

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది . న్యూజెర్సీ , న్యూయార్క్ పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది . అమెరికాలో గడచిన 24 గంటల్లో మొత్తం 18,37,170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు 1,06 , 195 మంది మృతి చెందగా కరోనా బారిన పడి 5,99,867 మంది కోలుకున్నారు . బ్రెజిలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది . గడచిన 24 గంటల్లో మొత్తం 5 , 14,992 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు 29,341 మంది మృతి చెందగా కరోనా బారిన పడి 2,06 , 555 మంది కోలుకున్నారు . స్పెయిన్లో గత 24 గంటల్లో మొత్తం 2,86 , 509 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు మొత్తం 27 , 127 మంది మృతి చెందగా  కరోనా బారిన పడి 1,96 , 958 మంది కోలుకున్నారు .

 రష్యాలో గడచిన 24 గంటల్లో మొత్తం 4,05,843 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు మొత్తం 4,693 మంది మృతి చెందగాకరోనా బారిన పడి 1,71,883 మంది కోలుకున్నారు . ఇటలీలో గడచిన 24 గంటల్లో మొత్తం 232,997 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు మొత్తం 33,415 మంది మృతి చెందగా కరోనా బారిన పడి 1,57 , 507 మంది కోలుకున్నారు . ఫ్రాన్స్ లో చూస్తే గడచిన 24 గంటల్లో మొత్తం 1,88,882 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు మొత్తం 28,802 మంది మృతి చెందగా కరోనా బారిన పడి 68,355 మంది కోలుకున్నారు . బ్రిటన్లో గడచిన 24 గంటల్లో మొత్తం 2,74,762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు మొత్తం 38,489 మంది మృతి చెందగా కరోనా బారిన పడి 30,250 మంది కోలుకున్నారు .

Related Articles

Back to top button