రాష్ట్రంలో భారీగా నమోదైన కరోనా కేసులు, COVID19 cases tally

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది . COVID19 cases tally జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే 196 మందికి కరోనా మహమ్మారి సోకగా , మరో ముగ్గురు వలస కార్మికులకూ సోకింది .

 ఆదివారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 199 కు చేరుకుందని వైద్య , ఆరోగ్యశాఖ కోవిడ్ -19 బులిటెన్లో పేర్కొంది . ఈ కేసులను కలుపుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా బాధితుల సంఖ్య 2698 కి చేరింది . వీరిలో 484 మంది వలస కార్మికులు , విదేశాల నుంచి వచ్చినవారే . జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది . ఆదివారం ఒక్కరోజే గ్రేటర్ లో రికార్డు స్థాయిలో 122 మంది కరోనా బారినపడ్డారు . అటు రంగారెడ్డి జిల్లా లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది . ఏకంగా 40 మందికి ఆదివారం కరోనా సోకింది .

COVID19 cases tally ::

 మరోవైపు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి . మేడ్చల్ లో 10 , ఖమ్మంలో 9 , మహబూబ్ నగర్ , జగిత్యాల , మెదక్ లో 3 , వరంగల్ అర్బన్లో 2 , సూర్యాపేట , నిర్మల్ , యాదాద్రి , జనగామ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది . కరోనా మరణ మృదంగం మోగుతూనే ఉంది . ఆదివారం మరో ఐదుగురు కరోనా వైరసకు బలయ్యారు . దీంతో తెలంగాణలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 82 కు చేరుకుంది . ఇప్పటివరకు 1428 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు . ఇంకా 1188 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు .

Related Articles

Back to top button