Trending

తెలంగాణలో కరోనా కల్లోలం, COVID cases in Telangana state

 తెలంగాణ లో రికార్డ్ స్థాయి లో COVID cases in Telangana state 253 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . మరో 8 మంది విగత జీవులయ్యారు . మరణాల సంఖ్య 182 కి చేరింది . ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసులు 4737 కి చేరాయి . 2203 అక్టీవ్ కేసులు కాగా 2852 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారు .

COVID cases in Telangana state ::

 మరోసారి అత్యధికంగా జిహెచ్ఎంసిలో 179 కేసులు నమోదయ్యాయి . సంగారెడ్డి జిల్లాలోనూ గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఒక్కరోజే 24 కేసులు నమోదు కాగా ఒకే కుటుంబంలో 19 మంది బాధితులయ్యారు . మేడ్చల్ లోనూ మరోసారి కరోనా ఉదృత రూపం దాల్చింది . ఇక్కడ 14 మంది బాదితులయ్యారు . రంగారెడ్డిలోనూ కరోనా తగ్గుముఖం పడతలేదు . ఇక్కడ 11 కేసులు నమోదు కాగా మహబూబ్ నగర్ లో 4 కేసులు నమోదయ్యాయి . వరంగల్ రూరల్ , వరంగల్ అర్బన్ , కరీంనగర్ , నల్గొండ , ములుగు , సిరిసిల్ల , మంచిర్యాల్ జిల్లాలతో 2 చొప్పున కేసులు నమోదు అయ్యాయి . సిద్ధిపేట , ఖమ్మం , మెదక్ , నిజామాబాద్ , నాగర్ కర్నూల్ , కామారెడ్డి , జగిత్యాల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి .

  జనగామ ఎమ్మెల్యే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది .ఎమ్మెల్యేతో పాటు భార్య , వంటమనిషి , డ్రైవర్ , గన్ మెన్ కరోనా బాధితులయ్యారు . దాంతో టిఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలయ్యింది . శుక్రవారం ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు . కాగా శనివారం ఎమ్మెల్యే భార్య ముత్తి రెడ్డి పద్మాలత రెడ్డి , డ్రైవర్ నరేందర్ , వంట మనిషి , గన్మెన్ లకు కూడా క రోనా పాజిటివ్ గా రిపోర్ట్ లు వచ్చాయి . దీంతో టి ఆర్ ఎస్ వర్గాలలో కలవరం మొదలైంది .

Related Articles

Back to top button