ఒక హత్యను దాచెందుకు 9 హత్యలు, 9 murders mystery traced in Telangana

గొర్రె కుంట హత్యాకాండ మిస్టరీని పోలీసులు ఛేదించారు. murders mystery traced in Telangana సంజయ్ ఒక్క హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో తొమ్మిది మంది ప్రాణం తీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రె కుంట హత్యాకాండ మిస్టరీని 72 గంటల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేధించారు .

 సోమవారం సాయంత్రం నిందితుడు సంజయ్ కుమార్ యాదవను మీడియా ముందుకు తీసుకొచ్చారు . వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు . బీహార్ బిగుసరయు జిల్లా నుర్లపూర్ గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ యాదవ్ వరంగల్ మిల్కలనీ ప్రాంతంలోని శాంతినగర్ లోని గోనె సంచుల తయారీ కేంద్రంలో పని చేసేవాడు . మక్సూద్ భార్య నిషా అక్క కూతురు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రఫికా ( 37 ) భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో వచ్చి ఇక్కడే ఉండేది . పని చేసే సమయంలో సంజయ్ కి ఆమెతో పరిచయం ఏర్పడింది . డబ్బు తీసుకుని ఆమె అతనికి భోజనం పెట్టేది .

First murder ::

 ఇదే క్రమంలో రఫికాను పెండ్లి చేసుకుంటానని నమ్మించి గీసు గొండ మండలం జాన్నాక ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ నాలుగేండ్లు సహజీవనం చేశాడు . కొన్నాళ్ల తర్వాత రఫికా కుమార్తెతో సంజయ్ అసభ్యంగా ప్రవర్తించాడు . గమనించిన రఫికా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది . రఫికా పెండ్లి విషయంలో తరుచూ గొడవపడుతుండటంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు . పెండ్లి విషయం తన బంధువులతో మాట్లాడటానికని రఫికాను తీసుకొని మార్చి 6 వ తేదీన రాత్రి 10 గంటలకు వరంగల్ లో విశాఖపట్నం వెళ్లే గరీబ్ రథ్ రైలు ఎక్కారు . మజ్జిగ ప్యాకెట్లో నిద్రమాత్రలు కలిపి రఫికాకు ఇచ్చాడు . ఆమె మత్తులోకి జారుకున్నాక తెల్లవారుజామున 3 గంటల సమయంలో చున్నీతో గొంతు బిగించి చంపి కిందకు తోసేవాడు .

 దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు అప్పట్లో ఎస్ఎఆర్ నెంబర్ 99/2020 కింద కేసు నమోదు చేశారు . అనంతరం సంజయ్ రాజమండ్రి రైల్వేస్టేషన్లో దిగి మరో రైలులో వరంగల్‌కు చేరుకున్నాడు . రఫికా పశ్చిమ బెంగాల్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లిందని ఆమె పిల్లలను నమ్మించాడు .

అయితే , రఫికా తమ బంధువుల ఇండ్లల్లో లేదని , ఏం చేశావని మక్సూద్ , నిషా నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు . దీంతో భయపడిన సంజయ్ మక్సూద్ దంపతులనూ మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు . ఈనెల 16 వ  తేదీన మత్తు మందు ను భోజనంలో కలిపి నిషా కుటుంబానికి ఇచ్చాడు. కుటుంబ సభ్యులు మత్తులోకి జారుకున్నారు . దాంతో అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5.00 గంటల మధ్య తొమ్మిది మందినీ ఒక్కొక్కరిగా గోనె సంచుల్లో పెట్టి ఈడ్చుకెళ్లాడు . గోదాం పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో పడేశాడు . వారంతా చనిపోయారని నిర్ధారించుకున్న నిందితుడు .. మృతుల గదుల నుంచి కిరాణ సరుకులు , వారి సెల్ ఫోన్లను తీసుకొని తన ఇంటికి వెళ్లాడు . బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాక గీసుగొండ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు .

murders mystery traced in Telangana :

 వరంగల్ పోలీసు కమిషనర్ 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు . పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు . పరిసరాల్లోని సీసీ ఫుటేజీలు , మృతుల సెల్ ఫోన్ కాల్ డేటాల ఆధారంగా నిందితుడ్ని గుర్తించి పట్టుకున్నారు . వరంగల్ ఈస్ట్ ఇన్ ఛార్జి డీసీపీ వెంకటలక్ష్మి , మామునూరు ఏసీపీ శ్యాంసుందర్ , గీసుగొండ సీఐ శివరామయ్య పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్ , టాస్క్ ఫోర్స్ , సైబర్ క్రైం , ఐటీ కోర్ , సీసీఎస్ టీం ఇన్ స్పెక్టర్లు నిందిరాంనాయక్ , మధు , జనార్ధన్ రెడ్డి , రాఘవేందర్ , రమేష్ కుమార్తో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు .

Related Articles

Back to top button