Trending

తెలంగాణలో కరోనా విలయతాండవం, COVID19 tally in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 169 కేసులు నమోదయ్యాయి మరియు నలుగురు మృతి చెందారు . COVID19 tally in Telangana జిహెచ్ఎంసిలో 82 , రంగారెడ్డిలో 14 మందికి వైరస్ సోకింది. దీంతో 2425 కి చేరిన కరోనా పాజిటిక్స్ సంఖ్య.

 రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . కొత్తగా 169 కేసులు నమోదు కాగా , నలుగురు మృతి చెంది నట్లు అధికారులు ప్రకటించారు . శుక్రవారం నమోదైన కేసుల్లో జిహెచ్ఎం సిలో 82 మంది , రంగారెడ్డిలో 14 , మెదక్ 2 , సంగారెడ్డిలో మరో ఇద్దరు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెనను విడుదల చేసింది . అదే విధంగా ఐదు గురు వలస కార్మికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విమాన మార్గంలో వచ్చిన మరో 64 మందికి వైరస్ నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొ న్నారు . దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 24 25 కు చేరగా , డిశ్చా ల సంఖ్య 138 1 పెరిగింది . ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 973 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు .

COVID19 tally in Telangana ::

 ఇప్పటి వరకు వైరస్ దాడిలో 71 మంది చనిపోయినట్లు వైద్యాశాఖ అధికారిక లెక్కలను వెల్లడించింది . అయితే గత మూడు రోజులుగా సగటున వందకు తగ్గకుండా కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తుంది .  కరోనా వైరస్ దాడిలో శుక్రవారం మరో నలుగురు మృతి చెందినట్లు అధి కారులు ధ్రువీకరించారు . కార్సినోమా థైరాయిడ్ తో బాధపడుతున్న 53 ఏళ్ల వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది . దాదాపు 7 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు . అదే విధంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న 59 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ సోకగా ఆసుప త్రిలో చేర్చారు . మూడు రోజుల పాటు వైద్యం అందించిన ఫలితం దక్కలే దని అధికారులు పేర్కొన్నారు . హెమి ప్లేరియా జబ్బుతో బాధపడుతున్న 62 ఏళ్ల వృద్ధుడికి వైరస్ సోకగా ఆసుపత్రిలో అడ్మిట్ చేసి 13 రోజులు పాటు వైద్యం అందించారు . కానీ వైరస్ దాడికి అతను మృతి చెందినట్లు బులిటె లో పేర్కొన్నారు . దీంతో పాటు హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధ మహిళకు ఇటీవల వైరస్ సోకింది . ఈమె కూడా ఐదురోజుల పాటు చికిత్స పొంది వైరస్ దాడిలో మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు .

 ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ స్వరాష్ట్రానికి వచ్చిన వారిలో 180 మంది కార్మికులకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు . అదే విధంగా మార్గాల నుంచి వచ్చి ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉన్న 458 మందిలో ఇప్పటి వరకు 207 మందికి వైరస్ తేలగా , 30 మంది విదేశీ యులూ కోవిడ్ బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు . 

Related Articles

4 Comments

Back to top button