కూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు,? Parents killed own daughter?

కుల అహంకారం మరొక యువతిని బలిగొంది. Parents killed own daughter? పుంగనూరు మండలంలోని మోదుగుల పల్లి గ్రామం బిసి ( వడ్డెర ) కులానికి చెందిన రత్నప్ప కుమార్తె హేమలత ( 22 ) , అదే మండలానికి చెందిన పాలెంపల్లి పంచాయతీ జువ్వలదిన్నె తండా దళిత వర్గానికి చెందిన చంగల్ రాయప్ప కుమారుడు రెడ్డి సంతోష్ ( 22 ) ఇరువురూ   ప్రేమించుకున్నారు .. పైగా మేజర్లు .. వారిరువురు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు . కులాలు వేరు కావడంతో పెద్దలు నిరాకరించారు . ఏలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు . సహించలేని తల్లిదండ్రులు చివరికి కన్నకూతుర్ని కడతేర్చారు.

‘ ఈ కులదురహంకార హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . స్థానికుల వివరాల మేరకు ప్రేమికులు ఇద్దరు చదువు పూర్తయిన తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు . మూడు మాసాల క్రితం ఇరువురూ పెళ్లి చేసుకోవాలని మదనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాము ప్రేమ వివాహం చేసుకుంటున్నామని , తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు . సొంతమండలం  పుంగనూరు కావున అక్కడి స్టేషన్కు వెళ్లాలని సూచించారు .

 ఈ విషయం కాస్త హేమలత కుటుంబ సభ్యులకు తెలిసింది . పుంగనూరు స్టేషన్‌కు చేరుకుని నీ   అంతు చూస్తామని అబ్బాయిని బెదిరించారు ‘ . ప్రాణ భయంతో అతను పోలీసులను ఆశ్రయించారు . దీంతో పోలీసులు ఇరు కుటుంబాల వారిని పిలిపించారు . అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అనడంతో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లాలని పోలీసులు సూచించారు .

Parents killed own daughter?

 ఎడ బాటును జీర్ణించు కోలేని సంతోష్ హేమలతకు తరుచూ ఫోన్ చేసే వాడు . గ్రహించిన తల్లిదండ్రులు హేమలతను మందలించారు . అయినా వీరి ప్రేమ వ్యహహారం అలాగే కొనసాగుతుండటంతో ఎక్కడ కులాంతర వివాహం చేసుకుంటుందోనని .. కూతురు ధోరణి నచ్చని తల్లిదండ్రులు , కుటుంబసభ్యులు 26 న హేమలతను హతమార్చారు . అనంతరం వారి పొలంలో మృతదేహాన్ని కాల్చివేశారు . ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు . దారుణం కులాంతర వివాహం చేసుకోకూడదని కుటుంబ సభ్యులే కూతుర్ని కడతేర్చడం దారుణమని మాదిగ రిజర్వే షన్ పోరాట కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.నరసింహులు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు . దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

Related Articles

Back to top button