ఒక్కొక్కరికి 70 వేల ఆర్ధిక ప్యాకేజీ, Coronavirus package Japan

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్దికంగా కుదేలు అయ్యయి, Coronavirus package Japan అన్ని దేశాల ప్రభుత్వాలు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటిస్తున్నాయి. సామాన్యులకు పూట గడవని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో జపాన్ తమ ప్రజలకు ఒక్కొక్కరికి సుమారు 70 వేల రూపాయలు కరోనా వైరస్ ఆర్ధిక ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

కరోనావైరస్ మహ మ్మారి ప్రపంచ దేశాలను వణికి స్తోంది . ఆ వైరస్ బారినపడిన జపాన్లోనూ రోజురోజుకూ విజృంభిస్తోంది . దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది . ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందో ని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు . జపాన్లో కొన్ని ప్రాంతాల్లో లా డౌన్ సడలించినప్పటికీ , చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోంది . దీంతో సామాన్యు లు మొదలుకుని , మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

Coronavirus package Japan ::

జపాన్ ప్రధానంగా పర్యాటకంపైనే ఆధార పడి ఉంది . 90 శాతం టూరిజం పడిపోయింది . దీంతోపాటు టోక్యో ఒలింపిక్స్- 2020 వాయిదా పడ్డాయి . ఈ నేపథ్యంలో దేశం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది . ప్రధానమంత్రి షింజో అబే 1 ట్రిలియన్ డాలర్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు . అందులో భాగంగా ప్రతి పౌరుడికి అంటే ఒక్కొక్కరికీ రూ .70 వేలు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు . ప్రధాని ప్రకటనపై జపాన్ ఆర్థిక నిపుణులు స్వాగతించారు . ఆర్థిక వ్యవస్థ గాడిలో పడే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తంచేశారు .

Related Articles

Back to top button