తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్, Telangana COVID19 cases tally

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. Telangana COVID19 cases tally కొత్తగా 117 పాజిటీవ్ కేసులతో పాటు మరో నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరగడం ఆగడం లేదు . గురువారంనాడు కొత్తగా 117 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి .

 ఇందులో తెలంగాణ నుంచి 66 ( జిహెచ్ఎంసిలో 58 , రంగారెడ్డిలో 5 , మేడ్చల్ 2 , సిద్దిపేటలో 1 ) మంది , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇద్దరు , సౌదీ అరేబియా నుంచి 49 మంది ఉన్నారు . ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది . కరోనా కారణంగా గురువారం రోజు నలుగురు మృతి చెందారు . కాగా , రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,256 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1345 కి చేరింది . కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 67 కి చేరింది . ఇంకా 844 మంది వివిధ ఆసువత్రులలో చికిత్స పొందుతున్నారు .

Telangana COVID19 cases tally ::

 ఇప్పటి వరకు నమోదైన 2,256 పాజిటీవ్ కేసుల్లో తెలంగాణ స్థానికులు 1908 ఉండగా , వలస కూలీలు 175 మంది , సౌదీ అరేబియా నుంచి 143  మంది , విదేశాల నుంచి వచ్చిన వారు 30 మంది వరకు ఉన్నారు . కాగా , వరంగల్ రూరల్ , యాదాద్రి , వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటీవ్ కేసు నమోదు కాలేదు.గత 14 రోజులుగా 20 జిల్లాల్లో కరీంనగర్ , సిరిసిల్ల , కామారెడ్డి , మహ బూబ్ నగర్ , మెదక్ , భూపాలపల్లి , నాగర్ కర్నూల్ , ములుగు , పెద్దపల్లి , సిద్దిపేట , మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం , అసిఫాబాద్ , ఖమ్మం , నిజామాబాద్ , ఆదిలాబాద్ , వరంగల్ అర్బన్ , గద్వాల్ , జనగామ్ , నిర్మల్ ) ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు . పాజిటీవ్ కేసుల సంఖ్య హైదరాబాద్ లో ఎక్కువగా నమోదవుతున్నాయి .

Related Articles

Back to top button