లాక్ డౌన్ విధించి మోడీ విఫలమయ్యారు, Rahul Gandhi comments on Lockdown
Rahul Gandhi comments on Lockdown వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరసన్ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ విఫలమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు . కరోనాను ఆరికట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటని మోడీ సర్కార్‌ను ఆయన నిలదీశారు .
రెండు నెలలుగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ దేశంలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయన్నారు . మంగళ వారం ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు . నాలుగు విడతలుగా విధించిన లాక్ డౌన్ ప్రధానమంత్రి మోడీ చెప్పిన ఫలితాన్ని ఇవ్వలేదని తెలిపారు . దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మోడీ , ఆతని సలహా సిబ్బంది అబద్దాలు ప్రచారం చేస్తున్నారని , వాస్తవానికి ఆలా జరగడం లేదని విమర్శించారు .
Rahul Gandhi comments on Lockdown ::
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేద ప్రజలను ఆదుకునేందుకు నేరుగా నగదు అందిస్తున్నట్లు తెలిపారు . కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు , వలస కార్మికులకు మద్దతు ఇస్తునప్పటికీ , ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి మాత్రం మద్దతు లభించడం లేదని ఆయన వాపోయారు . దేశ ఆర్ధిక వ్యవస్థను ఏ విధంగా చక్కదిద్దుతారో చెప్పాలని , కేంద్రం వ్యూహమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు . ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి డబ్బు చేర్చాలని కోరారు . పరిశ్రమలకు కూడా ప్రభుత్వమే ఆండగా నిలవాలన్నారు . ఈ సమయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ఎంతో ఆవసరమన్నారు.