అడ్డంగా దొరికిన అధికారులు,తహసీల్దార్ మందు పార్టీ, tahsildar booked for lock down violation

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నడి వోడ్డులో ఉన్న రెవెన్యూ tahsildar booked for lock down violation విశ్రాంతి భవనంలో అసాంఘిక కార్యక్రమాలు యథేచ్చగా కొన సాగుతున్నాయి . సోమవారం రాత్రి మద్యం , మాంసాహారంతో విందు చేసుకున్న సంఘటన వెలుగులోకి రావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు .
మధిర తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే తహసీల్దార్ కోసం మధిరలోని రైల్వే స్టేషన్ ఎదురుగా అనేక సంవత్సరాల క్రితం ప్రభుత్వం గెస్ట్ హౌసన్ను ఏర్పాటు చేసింది . ఈ గెస్ట్ హౌస్ లో సోమవారం రాత్రి తహసీల్దార్ సైదులు , ఈ ఓఅర్డి రాజారావు , మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ , సబ్ జైలర్ ప్రభాక ర్ రెడ్డి , ఆర్‌ఐ మధుసూధన్ , వీఆర్ గంటా శ్రీను మద్యంతో పాటు విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.
విషయం తెలుసుకున్న మీడియా తహశీల్దార్ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోగా కొంతమంది అధికారులు పరారయ్యారు . మరికొంతమంది అధికారులు బాత్రూమ్ లో , మంచం క్రింద దాక్కున్నారు.
tahsildar booked for lock down violation తహసీల్దార్ కార్యాలయంలో మద్యం , విందు పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందించిన దాదాపు 2గంటలపాటు పోలీస్ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు . దీంతో మధిర మీడియా ద్వారా ఏసీపీకి సమాచారం అందించగా తక్షణమే ఆయన స్పందించి మధిర పోలీసులను విందు జరిగే తహసీల్దార్ గెస్ట్ హౌస్ వద్దకు సిఐ వేణుమాధవ్ , పట్టణ ఎస్ఈ ఉదయ్ కుమార్లు వచ్చారు.
గదిలోకి వెళ్ళిన పోలీస్ అధికారులకు తహశీల్దార్ విశ్రాంతి భవనంలో మందు సీసాలు , మాంసాహారం కనిపించాయి . అదే క్రమంలో గదిలోని మంచం క్రింద దాక్కొని ఉన్న మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసు పట్టుకున్నారు . మందును సీజ్ చేశారు.
నలుగురిపై కేసు నమోదు తహసీల్దార్ సైదులు , మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ , ఈఓఅర్డి రాజారావు , సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసి వారికి సంబంధించిన మోటార్ సైకిళ్లను , కారును సీజ్ చేసినట్లు పట్టణ ఎస్ఐ ఉదయకుమార్ విలేకరులకు తెలిపారు.
ఈ విందుల్లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతున్న ఆర్‌ఐ మధుసూధన్ , మాటూరు వీఆర్ఓ గంటా శ్రీనును సైతం విచారించి ఈ విందు ల్లో పాల్గొన్నట్లు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు .